ప్రజల కోసమే సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2022-09-25T05:50:46+05:30 IST

ప్రజల సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుతం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

ప్రజల కోసమే సంక్షేమ పథకాలు
మాచర్లలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి 

- జోరుగా బతుకమ్మ చీరల పంపిణీ


గట్టు, సెస్టెంబరు 24: ప్రజల సంక్షేమం కోసమే తెలంగాణ ప్రభుతం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడుతున్నదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని మాచర్ల గ్రామంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల పంపి ణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలు అం దచేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. 

 కార్యకర్తలకు అండగా ఉంటాం

ప్రతీ టీఆర్‌ఎస్‌ కార్యకర్తకు పార్టీ అండగా ఉం టుందని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు. ముచ్చోనిపల్లి గ్రామాన్ని ఎమ్మెల్యే సందర్శించి ప్ర మాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పార్టీ కార్యకర్త కే.నర్సింహులు కుటుంబానికి రూ.2లక్షల చెక్కును భార్య పద్మమ్మకు  అందించారు. అనంత రం మాచర్ల గ్రామంలో బాధిత కుటుంబాలను ప రామర్శించి, పలువురికి సీఎం సహాయనిధి చెక్కు లను అందించారు. ఎంపీపీ విజయ్‌, జడ్పీటీసీ స భ్యురాలు బాసు శ్యామల, పీఏసీఎస్‌ చైర్మన్‌ వెంకటేశ్‌, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు హనుమంతునాయుడు, సర్పంచ్‌లు పీజీ.సిద్దిరామప్ప, చిన్న గో విందు, నర్సింహులు తదితరులున్నారు. 

- మల్దకల్‌ : మండలంలోని శేషంపల్లి గ్రామం లో పీఏసీఎస్‌ చైర్మన్‌ తిమ్మారెడ్డి మహిళలకు బతు కమ్మ చీరలను పంపిణీ చేశారు. ఆడపడుచులకు దసరా కానుకగా సీఎం కేసీఆర్‌ బతుకమ్మ చీరలను అందజేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్‌ ప్రతాప్‌, ఉపసర్పంచ్‌ పార్వతమ్మ, పంచాయతీ కా ర్యదర్శి రాము, డీలరు వెంకట్రాములు, నాయకులు పాల్గొన్నారు.

- కేటీదొడ్డి : మండల కేంద్రంతో పాటు, గువ్వ లదిన్నె గ్రామంలో శనివారం జడ్పీటీసీ సభ్యుడు రాజశేఖర్‌, వైస్‌ ఎంపీపీ రామకృష్ణనాయుడు మం డల అధికారులతో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఉరుకుందు, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు హన్మంతు, తహసీల్దార్‌ సుందర్‌రాజు, ఎంపీడీవో మహమ్మద్‌ అజార్‌ మొహియుద్దీన్‌, ఎంపీవో సయ్యద్‌ఖాన్‌, కేటీదొడ్డి, గువ్వలదిన్నె సర్పంచులు పావని, మహాదేవి, ఎంపీ టీసీ సభ్యుడు భీమయ్య, టీఆర్‌ఎస్‌ నాయకులు, కా ర్యకర్తలు పాల్గొన్నారు. 

- గద్వాల టౌన్‌ : పట్టణంలోని పలు వార్డుల్లో ముసినిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఎండీ.బాబర్‌, కౌన్సిలర్లు లక్ష్మీనరసమ్మ, టి.దౌలు, శ్రీమన్నారాయణ, నాగ రాజు, టి.శ్రీనుముదిరాజ్‌లు తమ వార్డుల పరిధిలో బతుకమ్మ చీరలను అందించారు. మహిళా సంక్షే మానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని బాబర్‌ తెలిపారు. 

Read more