ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ పనులను పరిశీలించిన ఎన్‌జీటీ బృందం

ABN , First Publish Date - 2022-02-25T05:52:54+05:30 IST

చెన్నైలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ బెంచ్‌ ఆదేశాల మేరకు ప్రతినిధి బృందం, కేంద్ర పర్యావరణ శాఖ ఆధికారులు కలిసి గురు వారం పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని, ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ను పరిశీలించారు.

ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ పనులను పరిశీలించిన ఎన్‌జీటీ బృందం
పనులను పరిశీలిస్తున్న ఎన్‌జీటీ బృందం సభ్యులు

బాదేపల్లి/ భూత్పూర్‌ ఫిబ్రవరి 24 : చెన్నైలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ బెంచ్‌ ఆదేశాల మేరకు ప్రతినిధి బృందం, కేంద్ర పర్యావరణ శాఖ ఆధికారులు కలిసి గురు వారం పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని, ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ను పరిశీలించారు. తొలుత భూత్పూర్‌ మండ లంలోని కర్వెన రిజర్వాయర్‌  13, 14, 15 ప్యాకేజీ పనులను పరిశీలించారు. ఆ తర్వా త వారు మధ్యాహ్నం ఉదండాపూర్‌కు చేరు కున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం, కడపక జిల్లాకు చెందిన చంద్రమౌళీశ్వర్‌రెడ్డి పాల మూరు ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు నిర్వహి స్తున్నారని, ఆ పనులను ఆపాలని నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. వారితో పాటు జడ్చర్లకు చెందిన వెంకటయ్యనే వ్యక్తి కూడా ఈ పథకానికి ఎలాంటి అనుమ తులు లేకుండా చెరువుల్లో మట్టిని తరలి స్తున్నారని ఫిర్యాదు చేయడంతో విచారణ స్వీకరించిన గ్రీన్‌ ట్రిబ్యునల్‌ వాస్తవ పరి స్థితిపై నివేదికను కోరింది. ఇప్పటికే ఒక పర్యాయం పర్యటించి వెళ్లిన గ్రీన్‌ ట్రిబ్యునల్‌ అధికారులు బెంచికి నివేదికను ఇచ్చారు. తా జాగా ట్రిబ్యునల్‌ ఆదేశాలను ధిక్కరించి పనులు చేపడుతున్నారని పిటిషన్‌ దారులు మళ్లీ బెంచిని ఆశ్రయించడంతో పనులను ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన బెంచి మరోసారి ట్రిబ్యునల్‌ అధికారులకు సూచించడంతో పనులు జరుగుతున్న ప్రాం తాన్ని గురువారం ఇక్కడ పర్యటించారు. పనులు జరుగుతున్నాయా లేదా ఆని ఆరా తీశారు. ఇప్పటి వరకు జరుగిన పనుల వి వరాలను అధికారుల నుంచి నివేదిక రూపంలో తీసుకున్నారు. ఈ అంశాలన్నింటినీ బెంచికి సమర్పించనున్నట్లు తెలిపారు. నేష నల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ బృందం హైదరాబాద్‌ ఐఆర్‌వో, ఎంవోఈఎఫ్‌, సీసీ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఇ.అరోకియాలెనిన్‌, సీపీసీమీ, ఐఆర్‌వో చెన్నై బీ,ఎం సైంటిస్ట్‌ పూర్ణిమ, జిల్లా కలెక్టర్‌ ఎస్‌ వెంకట్‌రావు, డైరెక్టర్‌, మైన్స్‌, జియాల జిస్ట్‌ విజయకుమార్‌, జోనల్‌ సెంటర్‌ నీటి శాస్త్రవేత డాక్టర్‌ పీ.ఆర్‌. మేగనాథన్‌, హైద రాబాద్‌ సీడబ్యూసీ, కేజీమీవో డైరెక్టర్‌ ఎం.రమేష్‌ కుమార్‌, కేఆర్‌ఎంమీ నాడల్‌ ఏజెన్సీ హైదరాబాద్‌ పవర్‌ సభ్యులు ఎల్‌.బి. ముంతంగ్‌ సభ్యులు జిల్లా కలెక్టర్‌తో పాటు ఉదండాపూర్‌  15, 17, 18లను ప్యాకేజీ ప నులను పరిశీలించారు. కర్వెన నుంచి ఉదండాపూర్‌ వరకు నిర్మిచిన టన్నెల్స్‌ లోపలికి వెళ్లీ పరిశీంచారు. రిజర్వాయర్‌ పంప్‌ హౌస్‌ను ఈ బృందం సభ్యులు పరిశీలిం చారు. ఈ సందర్బంగా పనుల పరిశీలన అంశంపై పూర్తి నివేదికను ఎన్‌జీటికి అం దజేయనున్నట్లు తెలిపారు.  వారితో పాటు ఆర్‌డీవో పద్మశ్రీ, అధికారులు ఉన్నారు. 



 ఆముదం క్షేత్ర ప్రదర్శనలో పాల్గొన్న ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, వ్యవసాయ శాస్త్రవేత్తలు

ఆముదం పంటపై క్షేత్ర ప్రదర్శన

మన్ననూర్‌, ఫిబ్రవరి 24 : అమ్రాబాద్‌ మండలం వేంకటేశ్వరబావి గ్రామంలో గురువారం ఆము దం పంటపై సూరం దామోదర్‌రెడ్డి అనే రైతు వ్యవసాయ పొలం వద్ద క్షేత్ర ప్రదర్శన నిర్వహించా రు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌ గువ్వల బాల రాజు, పాలెం వ్యవసాయ పరిశోధన స్థానం డైరెక్టర్‌ ఎం.గోవర్ధన్‌, జిల్లా వ్యవసాయ అధికారి వెంక టేశ్వర్‌రావు, సర్పంచ్‌ పద్మమ్మ, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, మం డలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు మాట్లాడుతూ పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు సలహాల మేరకు రైతులు నూతన వంగడాలను సాగు చేసి నల్లమల బ్రాండ్‌తో మార్కెట్‌లో విక్రయించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ఈ ప్రాంతానికి సాగునీరందించ డానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ పాలెం ఏడీఆర్‌ డాక్టర్‌ ఎం.గోవర్ధన్‌ రబీ సీజన్‌లో ఆముదం పంటను సాగు చేసిన రైతు దామోదర్‌రెడ్డిని అభినందించారు. ఈ ప్రాంతంలో ఆలుగడ్డ, ఆవాలుతో పాటు మేలు రకం వంగడాలను రైతులు వేసు కుంటే వేరుశనగ అధిక దిగుబడి వస్తుందని దీంతో రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని సూచించారు. పలువురు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు పలు సూచనలు చేశారు. నూనె గింజల పరిశోధన శాస్త్రవేత్త డాక్టర్‌ లావణ్య, డాక్టర్‌ లక్ష్మ మ్మ, డాక్టర్‌ సదయ్య, డాక్టర్‌ నళిని, డాక్టర్‌ దివ్యరాణి, డాక్టర్‌ శైలా, అచ్చంపేట ఏడీఏ చంద్రశేఖర్‌, తహసీల్దార్‌ రాజేందర్‌రెడ్డి, ఎంపీడీవో శంకర్‌, ఏవో సందీప్‌, రైతుబంధు మండలాధ్యక్షుడు రాజారాం, ఏఈ వోలు బాలాజీ, సీతారాం, భార్గవి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-25T05:52:54+05:30 IST