ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2022-12-02T00:01:19+05:30 IST

Must be aware of AIDS

 ఎయిడ్స్‌పై అవగాహన కలిగి ఉండాలి
జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌

జెండా ఊపి ర్యాలీని ప్రారంభించిన అదనపు కలెక్టర్‌

నారాయణపేట, డిసెంబరు 1 : ఎయిడ్స్‌ వ్యాధిపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌ పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్‌ డే సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద ర్యాలీని గురువారం అదనపు కలెక్టర్‌ మయాంక్‌ మిట్టల్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్‌ వ్యాధిపై అవగాహన కలిగి ఉండి, పరీక్షలు చేయించుకొని వ్యాధి నివారణకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో రాం మనోహర్‌రావు, వైద్య సిబ్బంది డాక్టర్‌ శైలజ, డాక్టర్‌ రాఘవేంద్ర, రహమతుల్లా, సుఽధాకర్‌బాబు, సుధాకర్‌, స్వచ ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మాగనూరు : మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో గురువారం పాఠశాల విద్యార్థులచే ఎయిడ్స్‌ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ ఎయిడ్స్‌ ప్రాణాంతక వ్యాధి కాదని, ఎయిడ్స్‌ సోకిన వ్యక్తులు చికిత్స చేయించుకొని క్రమం తప్పకుండా మందులు వాడాలన్నారు. అనంతరం ఎయిడ్స్‌పై స్థానికులకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెల్త్‌ సూపర్‌వైజర్‌ యాదమ్మ, ఉపాధ్యాయులు రామ్మోహన్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

కోస్గి : కోస్గి పట్టణంలోని గుండుమాల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఎయిడ్స్‌ అవగాహన ర్యాలీ నిర్వహించారు. గురువారం పట్టణంలోని శివాజీ చౌరస్తాలో వైదులు రాఘవేంద్రకుమార్‌ ఆధ్వర్యంలో ప్రజలకు ఎయిడ్స్‌ వ్యాధిపై అవగాహన కల్పించారు. వైద్య సిబ్బంది రాంచెందర్‌జీ, మనిమాల, నీలమ్మ పాల్గొన్నారు.

ఊట్కూర్‌ : ప్రపంచ ఎయిడ్స్‌ డే సందర్భంగా మండల కేంద్రంలో స్థానిక పీహెచ్‌సీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆయా పాఠశాలల విద్యార్థులతో పురవీధుల గుండా ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలను చేస్తూ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు సర్పంచ్‌ సూర్యప్రకాష్‌రెడ్డి ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ఎయిడ్స్‌ అనేది అంటు వ్యాధి కాదని, చేతులు కలపడం, కలిసి తినడం ద్వార ఇతరులకు సోకదన్నారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, ఎయిడ్స్‌ వ్యాధి గ్రస్తుల రక్తం ఎక్కించడం ద్వారనే ఇతరులకు సోకే అవకాశం ఉందన్నారు. ఉప సర్పంచ్‌ ఇబాదుర్‌ రహెమాన్‌, ఆరోగ్య విస్తీర్ణ అధికారి విజయ్‌కుమార్‌, పర్యవేక్షులు మణిమాల, పిజికల్‌ డైరెక్టర్‌ నర్సింహులు, ఆరోగ్య కార్యకర్తలు సుజాత, మహేశ్వరి, కవిత, మంజుల, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-02T00:01:21+05:30 IST