కాంగ్రెస్ పార్టీలో పలువురి చేరిక
ABN , First Publish Date - 2022-05-15T05:30:00+05:30 IST
బాలానగర్ మండలం నందారం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్యనాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

రాజాపూర్, మే 15 : బాలానగర్ మండలం నందారం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్యనాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ గ్రామంలో కాంగ్రెస్‌పార్టీ జడ్చర్ల నియోజకవర్గ సమన్వయ కర్త జనంపల్లి అనిరుధ్ రెడ్డి నివాసంలో శనివారం ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అనిరుధ్‌రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి చేర్చుకున్నారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ పార్టీలో సినియర్లకు విలువలు లేకుండా చుస్తునందుకే కాంగ్రెస్ పార్టీలొ చేరిన్నాట్లు పేర్కోన్నారు.అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రలంతో సర్పంచ్ల్‌కు, ఎంపీటీసీలకు నిధులు ఇవ్వడం లేదని, ప్రజలకు సరైన పాలన అందించి గ్రామస్థాయిలో సర్పంచ్‌లు అప్పులపాలు అవుతున్నారని, త్వరలో ఓ గ్రామానికి చెందిన సర్పంచ్, ఆమే భర్తల, పలువురు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాట్లు పేర్కోన్నారు. కార్యక్రమంలో బాలానగర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆదిరమణారెడ్డి, కిషన్, సింగోటం రెడ్డి, అవినాష్ రెడ్డి, సుభాష్ రెడ్డి, నర్సిములు, శేఖర్, రాజు, కుమార్, నాగేష్, మహేందర్ పాల్గొన్నారు.