మాణికేశ్వరి మాత సమారాధన మహోత్సవం

ABN , First Publish Date - 2022-03-17T04:48:11+05:30 IST

జిల్లా కేంద్రానికి సమీపంలోని కర్ణాటక రాష్ట్రం సూర్యనంది (యానగుంది) క్షేత్రంలో వెలిసిన వీరధర్మజ మాత మాణికేశ్వరి ద్వితీయ సంవత్సర సమారాధన మహోత్సవం మూడోరోజు బుధవారం ఘనంగా కొనసాగింది.

మాణికేశ్వరి మాత సమారాధన మహోత్సవం
మాణికేశ్వరి మాత పూజల్లో పాల్గొన్న పేట అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రారెడ్డి

నారాయణపేట టౌన్‌, మార్చి 16 : జిల్లా కేంద్రానికి సమీపంలోని కర్ణాటక రాష్ట్రం సూర్యనంది (యానగుంది) క్షేత్రంలో వెలిసిన వీరధర్మజ మాత మాణికేశ్వరి ద్వితీయ సంవత్సర సమారాధన మహోత్సవం మూడోరోజు బుధవారం ఘనంగా కొనసాగింది. ఈ సందర్భంగా రుద్రాభిషేకం, అలంకరణతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభకు ట్రస్ట్‌ కార్య దర్శి శివయ్య స్వామి అధ్యక్షత వహించగా శ్రీశక్తి పీఠం బిజ్వార్‌ ఆదిత్య పరం జ్యోతి స్వామిజీ పాల్గొని ప్రసంగించారు. మాతాజీ ప్రపంచానికి పరదేవతా స్వరూపంగా ఉండి భక్తులను రక్షిస్తుందని మనందరం అహింసా మార్గంలో పయ నించాలన్నారు. కర్ణాటక రాష్ట్రంలోని వివిధ మఠాధిపతులు పాల్గొని వీరధర్మజ మాత సాక్షాత్తు శివ రూపమని సూర్యనంది కైలాసమని ఉద్భోదించారు. శివయ్య స్వామి ప్రసంగిస్తూ అమ్మవారు విరాట్‌ స్వరూపమని వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఈ విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సేడం ఎమ్మెల్యే రాజ్‌కుమార్‌ పాటిల్‌, మాజీ మంత్రి మల్కిరెడ్డి, నారాయణ పేట అడిషలన్‌ కలెక్టర్‌ చంద్రారెడ్డి, పుర వైస్‌ చైర్మన్‌ హరినారాయణ భట్టడ్‌, ట్రస్ట్‌ సభ్యులు సిద్ది రామప్ప, మందార్‌, బండి శివరాంరెడ్డి పాల్గొన్నారు.

మాణికేశ్వరి పాదుక పూజ

నారాయణపేట : టీఆర్‌ఎస్‌ నాయకుడు కృష్ణ కోర్వార్‌ బుధవారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మాత మాణికేశ్వరి ఆరాధనోత్సవాలను పురస్కరిం చుకొని మాణికేశ్వరి మాత పాదుక పూజ, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు గందె చంద్ర కాంత్‌, కన్న జగదీశ్‌, విజయ్‌ సాగర్‌, చెన్నారెడ్డి, రమేష్‌, సుభాష్‌, వెంకటేష్‌, ప్రతాప్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి, మా ణిక్‌, ప్రకాష్‌ భట్టడ్‌, ఆనంద్‌ పాల్గొన్నారు.



Updated Date - 2022-03-17T04:48:11+05:30 IST