మహేంద్రనాథ్ సేవలు వెలకట్టలేనివి
ABN , First Publish Date - 2022-08-01T04:44:45+05:30 IST
కందనూలు ప్రాం తంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవి తాంతం కృషి చేసిన మాజీ మంత్రి మహేంద్రనాథ్ సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అ న్నారు.
- ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి
- జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్‌రాం, మహేంద్రనాథ్ విగ్రహాల ఆవిష్కరణ
- హాజరైన ప్రభుత్వ విప్ గువ్వల, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం
నాగర్‌కర్నూల్ టౌన్, జూలై 31: కందనూలు ప్రాం తంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవి తాంతం కృషి చేసిన మాజీ మంత్రి మహేంద్రనాథ్ సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జగ్జీవన్‌రాం భవన్ వద్ద భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌రాం, మాజీ మంత్రి పుట్టపాగ మహేంద్రనాథ్ విగ్రహావిష్కర ణ కార్యక్రమానికి ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, జడ్పీ చైర్ పర్సన్ పె ద్దపల్లి పద్మావతి, ఎంపీ రాములు, ఎమ్మెల్సీ దామోద ర్‌రెడ్డి, మాజీ ఎంపీ మంద జగన్నాథం హాజరై విగ్రహాల ఆవిష్కరణ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత పేద విద్యార్థుల కోసం జాతీయోన్నత పాఠశాల నెలకొ ల్పి వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన మహ నీయుడు మహేంద్రనాథ్ అన్నారు. మహేంద్రనాథ్ సే వలు చిర స్థాయిగా గుర్తుండిపోయేలా కొల్లాపూర్, అ చ్చంపేట, కల్వకుర్తి వెళ్లే ప్రాంతాలను కలిపే జిల్లా కేంద్రంలోని కూడలి కొ ల్లాపూర్ చౌరస్తా వద్ద 25 అడుగుల ఎత్తైన కాంస్య విగ్రహం ఏర్పాటుకు సం కల్పించానని పేర్కొన్నారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా మహేంద్రనాథ్ కాంస్య వి గ్రహాన్ని ఆవిష్కరణ చే యించడంతో పాటు చౌర స్తాకు మహేంద్రనాథ్ చౌ రస్తాగా నామకరణం చే యిస్తానన్నారు. ప్రభుత్వ విఫ్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ మహనీయుడు మహేంద్రనాథ్ మన మధ్య లేకపోయినా ఆయన పేరు చిరకాలం ఉంటుందన్నారు. ఎంపీ రాములు మా ట్లాడుతూ మహేంద్రనాథ్ స్ఫూర్తితోనే తానీ స్థాయికి వ చ్చానని, ఆయన అడుగు జాడల్లో జీవితాంతం నడుస్తూ నే ఉంటానన్నారు. ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ మహేంద్రనాథ్ కుల మతాలకు అతీతం గా కందనూలు ప్రాంతం అభివృద్ధిని జీవితాతం పాటు పడిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. మాజీ ఎంపీ మంద జగన్నాథం మాట్లాడుతూ నాగర్‌కర్నూల్ జిల్లాకు మహేంద్రనాథ్ జిల్లాగా నామకరణం చేయాలని ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి రాంలాల్, జడ్పీటీసీ భరత్‌ప్రసాద్, జాతీయోన్నత పాఠశాల విద్యా సంస్థల చైర్మన్ పి.మునీంద్రనాథ్, వార్డెన్ చెన్నయ్య, జెట్టి ధర్మరాజు, మురళీధర్‌రావు, అబ్దుల్లాఖాన్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి నివాళి
జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్‌రాం భవన్ వద్ద ఆవిష్కరించిన బాబు జగ్జీవన్‌రాం, మహేంద్రనాథ్ నూతన విగ్రహాలకు మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహేంద్రనాథ్ సేవలు మరువలేనివని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అర్థం రవి, పట్టణ అధ్యక్షుడు తిమ్మాజిపేట పాండు, కౌన్సిలర్ నిజాముద్దీన్, వార్డెన్ చెన్నయ్య మల్లయ్య, బాలగౌడ్, అర్జునయ్య తదితరులు పాల్గొన్నారు.