యాజమాన్య పద్ధతులు పాటిస్తే నష్టాన్ని నివారించొచ్చు

ABN , First Publish Date - 2022-10-13T04:28:10+05:30 IST

యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంటల్లో నష్టాన్ని కొంతవరకు నివారించొచ్చని జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు డాక్టర్‌ మహేశ్వరమ్మ, రాజమణి అన్నారు.

యాజమాన్య పద్ధతులు పాటిస్తే నష్టాన్ని నివారించొచ్చు
కొండాపేటలో పత్తిపంటను పరిశీలిస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు

- పంటలను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

ఇటిక్యాల, అక్టోబరు 12 : యాజమాన్య పద్ధతులు పాటిస్తే పంటల్లో నష్టాన్ని కొంతవరకు నివారించొచ్చని  జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు డాక్టర్‌ మహేశ్వరమ్మ, రాజమణి అన్నారు. బుధవారం వ్యవసాయశాస్త్రవేత్తలు మండలంలోని యాక్తాపురం, కొండాపేట, మునగాల గ్రామాల్లోని పంట పొలాలను పరిశీలించారు.  వరుసగా వర్షాలు కురుస్తుండడంతో పత్తి, మిరప, వరి పంటలు పూర్తిగా నీట మునిగాయన్నారు.   పంటలకు ఆశించిన కుళ్లు తెగుళ్లపై రైతుల కు అవగాహన కల్పించారు. వరిపంట పొట్టదశలో ఉండటంతో వర్షానికి దెబ్బతినడం వలన సరైన యాజమా న్య పద్ధతులు పాటిస్తే కొంత వరకు లాభాలు చేకూ రుతాయన్నారు. పత్తిపంటలో రసం పీల్చే పురుగు, గు లాబీరంగు పురుగు సోకడం వలన కాయకుళ్లు తెగులు ఎక్కువగా ఉండటంతో పంట నష్టం వాటిల్లిందన్నారు. రైతులు వ్యవసాయాధికారుల ద్వారా తగిన సూచనలు, సలహాలు పాటించి పంట నష్టం జరగకుండా దిగుబడి ఎక్కువగా వచ్చే విధంగా మెళకువలు పాటించాలన్నారు. కార్యక్రమంలో జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు   డాక్టర్‌ శైల, డాక్టర్‌ విజయలక్ష్మి, ఏవో అయూబ్‌, ఏఈవోలు మౌనిక, షర్మిళాదేవి, జడ్పీటీసీ సభ్యుడు హన్మంతురెడ్డి, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. 

Read more