పోలీసులకు విజయం వరించాలి

ABN , First Publish Date - 2022-10-04T05:08:51+05:30 IST

నిరంతరం ప్రజాసేవలో జీవించే జిల్లా పోలీసులకు దసరా పండుగ సందర్భంగా దుర్గాదేవి అనుగ్రహంతో విజయం వరించాలని ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్‌ ఆకాంక్షించారు.

పోలీసులకు విజయం వరించాలి
ఆయుధపూజ చేస్తున్న డీఎస్పీ రంగస్వామి

- గద్వాల జిల్లా  ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌

గద్వాల క్రైం, అక్టోబరు 3 : నిరంతరం ప్రజాసేవలో జీవించే జిల్లా పోలీసులకు దసరా పండుగ సందర్భంగా దుర్గాదేవి అనుగ్రహంతో విజయం వరించాలని ఎస్పీ రంజన్‌రతన్‌కుమార్‌ ఆకాంక్షించారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని సాయుధదళ పోలీస్‌ కార్యాలయంలో డీఎస్పీ రంగస్వామితో కలిసి ఆయు ధాలకు ,  వాహనాలను ప్రత్యేక పూజలు చేశారు. విధి నిర్వహణలో పోలీసులు ఆయు ధాలకు, వాహనాలకు, ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్‌ యంత్రాంగం దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలకు అందుబాటులో ఉండి ఉత్తమ సేవలు అందించేలా దీవించాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో సాయుధ దళ డీఎస్పీ ఇమ్మానియేల్‌, ఇన్స్‌పెక్టర్‌ నాగేష్‌, గద్వాల సీఐ చంద్రశేఖర్‌,  పట్టణ ఎస్‌ఐ హరిప్రసాద్‌రెడ్డి తదితరులున్నారు.

Read more