కోటకొండను మండలం చేయాలి

ABN , First Publish Date - 2022-08-18T04:27:05+05:30 IST

అన్ని అర్హతలున్న కోటకొండను మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు.

కోటకొండను మండలం చేయాలి
పేట అంబేడ్కర్‌ చౌరస్తాలో రాస్తారోకో చేస్తున్న సీపీఐ (ఎంఎల్‌) ప్రజాపంథా నాయకులు

- సీపీఐ (ఎంఎల్‌) ప్రజాపంథా ఆధ్వర్యంలో రాస్తారోకో

నారాయణపేట రూరల్‌, ఆగస్టు 17 : అన్ని అర్హతలున్న కోటకొండను మండల కేంద్రంగా ప్రకటించాలని కోరుతూ సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పార్టీ కార్యదర్శి హాజీమలంగ్‌, వెంకట్రాములు మాట్లాడుతూ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం మండలాలు, రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసిందన్నారు. అందులో భాగంగానే 29 పంచాయతీలతో కూడిన పేట మండలాన్ని రెండుగా విభజించి కోటకొండను మండలంగా ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి ఆర్డీవో కార్యాలయ ఏవోకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ (ఎంఎల్‌) ప్రజాపంథా డివిజన్‌ నాయకులు కె.నారాయణ, శివాజీ, సలీం, అంజి, ప్రతాప్‌, రవి, కృష్ణ, హన్మంతు, రాము, గణేష్‌, రఫీ, సుధాకర్‌, శేఖర్‌, యూసుఫ్‌, మౌలాలి, రెహమాన్‌, దస్తప్ప, వెంకటప్ప, రమేష్‌బాబు పాల్గొన్నారు.

సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టర్‌ ఏవోకు వినతి 

మండలంలోని కోటకొండను మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ ఏవో నర్సింహరావుకు సీపీఎం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. నాయకులు బాల్‌రాం, బాలకృష్ణ, మన్యం, దినకర్‌, దస్తప్ప, లక్ష్మయ్య, జములప్ప పాల్గొన్నారు.

Updated Date - 2022-08-18T04:27:05+05:30 IST