-
-
Home » Telangana » Mahbubnagar » Kanakadurga Devi is Vasavimata in avatara-MRGS-Telangana
-
కనకదుర్గ్గాదేవి అవతారంలో వాసవీమాత
ABN , First Publish Date - 2022-10-05T04:58:15+05:30 IST
వాసవీమాత మంగళవారం కనకదుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

పాలమూరు, అక్టోబరు 4 : వాసవీమాత మంగళవారం కనకదుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆరవైశ్యులు గుండా వెంకటేష్ కు టుంబ సభ్యులు వాసవీమాతకు అభిషేకం చేశారు. సాయంత్రం గుద్దేటి విజ యలక్ష్మి కుటుంబం ఆధ్వర్యంలో అమ్మవారికి పల్లకీసేవ నిర్వహించారు. ఆర్య వైశ్య మహిళలు ఉదయం కుంకుమార్చన, సాయంత్రం వాసవీమాత పారా యణ, కోలాటం, దాండియా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి యం. వేణుగోపాల్, కోశాధికారి టి.నాగరాజు, కొండా చక్రధర్ గుప్తా, మీడియా ఇన్చార్జి ఎదిరె ప్రమోద్ కుమార్, ఆర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఫ రవీంద్రనగర్‌లోని వెండిపోచమ్మ అమ్మవారు మంగళవారం మహిషా సురమర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కనికె రోజ-పవన్ కుమా ర్, బోరీగల మాధవి-విశ్వేశ్వర్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు కె.శ్రావణ్ కుమా ర్, కౌన్సిలర్ బి.వేదవ్రత్, బి.ఆనంద్, కె.సత్యం, పి.గణేష్ ఆధ్వర్యంలో విజయ లక్ష్మి-డా.భీంరాజ్ అన్నదానం చేయటం సంతోషకరమన్నారు.
ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలి
గండీడ్/ మహమ్మదాబాద్, అక్టోబరు 4 : దసరా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని జడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వెన్నాచేడ్ గ్రామంలో దుర్గ్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి మండల పరిధిలోని మంగంపేట్ తండాలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పుల్లారెడ్డి, గీతాపాండు, ఎంపీటీసీ రేణుక, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భిక్షపతి, గిరిధర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, రాంరెడ్డి, వెంకట్‌రెడ్డి, రాములు, వెంకటయ్య పాల్గొన్నారు.
మహిషాసురమర్ధిని అవతారంలో అమ్మవారు
మిడ్జిల్ : నవరాత్రి వేడుకల్లో భాగంగా గ్రామాలలో కొలువుదీరిన దుర్గామాత మంగళవారం మహిషాసురమర్ధిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మండల కేంద్రంలోని ఈదమ్మ ఆలయంలో మహిషాసురమర్ధిని అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారికి ఎస్ఐ రామ్‌లాల్ నాయక్, ఎంపీడీవో సాయిలక్ష్మి, ఎంపీవో అనురాధ, గ్రామ సర్పంచ్ రాధికావెంకట్రెడ్డి, మాజీ జడ్పీటీసీ హైమావతిబాల్రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సురద్శన్, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లె తిరుపతి, నాయకులు భాస్కరాచారి, పర్వతాలు, వడ్డె శేఖర్ తదితరులు ఉన్నారు.
