కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పేదలకు వరం

ABN , First Publish Date - 2022-12-31T22:56:29+05:30 IST

పేదింటి ఆడపిల్లల కుటుంబాల్లో సంతోషం నిం పేందుకే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్నారని అలం పూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు.

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పేదలకు వరం

- అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం

- వడ్డేపల్లి, మానవపాడు, ఉండవల్లి మండలాల్లో లబ్ధిదారులకు చెక్కులు అందజేత

వడ్డేపల్లి/మానవపాడు/ఉండవల్లి, డిసెంబరు 31 : పేదింటి ఆడపిల్లల కుటుంబాల్లో సంతోషం నిం పేందుకే కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్నారని అలం పూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం అన్నారు. దేశంలోని ఏ రా ష్ట్రంలో కూడా ఇలాంటి పథకాలు అమలు కావడం లేదని తెలిపారు. శనివారం వడ్డేపల్లి, మానవపాడు, ఉండవల్లి మండల కేంద్రంలో లబ్ధిదారులకు చెక్కు లను అందజేశారు. వడ్డేపల్లి మండల కేంద్రంలోని త హసీల్దార్‌ కార్యాలయం వద్ద 54మంది లబ్ధిదారు లకు రూ.5,40,6,263ల కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్‌పర్సర్‌ కరుణ, ఎంపీపీ రజితమ్మ, జడ్పీటీసీసభ్యుడు కాశపోగు రాజు, ఆర్డీఎస్‌ మాజీ చైర్మన్‌ సీతారాంరెడ్డి, సీనియర్‌ నాయకులు రవిరెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకటేశ్వర్‌ రెడ్డి, సర్పంచులు ఆం జనేయులు, తిమ్మప్ప, మార్కెట్‌ యార్డ్‌ డైరెక్టర్‌ మహేష్‌, కోయిలదిన్నె శేఖర్‌, రాజు, రెవెన్యూ అధికా రులు, బీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు. అలాగే మాన వపాడు మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాల యంలో వివిధ గ్రామాలకు చెందిన 20మంది లబ్ధి దారులకు ఎమ్మెల్యే అబ్రహాం కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం మండల కేంద్రంలో రూ.5లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ ఎస్‌ మండల అధ్యక్షుడు నాగేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ రోశన్న, సర్పంచులు నారాయణ, నరేంద్రరెడ్డి, మాజీ సర్పంచు వెంకట్రాముడు, పీఏసీఎస్‌ వైస్‌చైర్మన్‌ అయ్యన్న, మండల ప్రధాన కార్యదర్శి హుసేన్‌, రాజశేఖర్‌, రాంభూపాల్‌రెడ్డి, మహ్మద్‌, ప్రభాకర్‌, నా యకులు పాల్గొన్నారు. అలాగే ఉండవల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో 28 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే అబ్రహాం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సురవరం లోకేశ్వర్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ దేవన్న, ఎంపీటీసీ సభ్యులు రాజశేఖర్‌, సుంకన్న, కురుమూర్తి, సర్పంచులు శేషన్‌ గౌడు, నాగేష్‌, తహసీల్దార్‌ వీరభద్రప్ప, ప్ర జాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T22:56:30+05:30 IST