ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2022-12-31T22:56:40+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో తప్పులు దొర్లాయని, సంబంధిత అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని పేట కౌన్సిలర్‌ సలీం డిమాండ్‌ చేశారు.

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు న్యాయం చేయాలి
మరికల్‌ పీఎస్‌లో అరెస్టు అయిన యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు

నారాయణపేట, డిసెంబరు 31 : రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో తప్పులు దొర్లాయని, సంబంధిత అభ్యర్థులకు ప్రభుత్వం న్యాయం చేయాలని పేట కౌన్సిలర్‌ సలీం డిమాండ్‌ చేశారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శనివారం ప్రగతి భవన్‌ ముట్టడికి పిలుపు ఇవ్వగా యువజన కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు పీఎస్‌కు తరలించారు. ఈ సందర్భంగా సలీం హైకోర్టు ఆదేశాల మేరకు తప్పులు దొర్లిన ప్రశ్నలకు మార్కులు కలిపి అర్హులకు న్యాయం చేయా లని ప్రభుత్వాన్ని కోరారు. మోసపూరిత చర్యలకు పాల్పడకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అరెస్టు అయిన వారిలో కాంగ్రెస్‌ నాయకులు మహిముద్‌ ఖురేషి, యూసూఫ్‌ తాజ్‌ ఉన్నారు.

కాంగ్రెస్‌ నాయకుల ముందస్తు అరెస్టు

మరికల్‌ : మరికల్‌ మండల యూత్‌ కాంగ్రెస్‌ నాయకులను శనివారం ఎస్‌ఐ అశోక్‌ బాబు ముందస్తు అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా యూత్‌ కాంగ్రెస్‌ నాయకుడు టైసన్‌ రఘు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై కేసీఆర్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో యువజన కాంగ్రెస్‌ నాయకుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌ ముట్టడికి పిలుపు నిచ్చారన్నారు. ముట్టడికి వెళ్లకుండా ఎస్‌ఐ ముందస్తు అరెస్టు చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్‌ నాయకులను భయభ్రాంతులకు గురి చేయడానికి కుట్రలు పన్ని కాంగ్రెస్‌ కార్యాచరణను కేసీఆర్‌ తిప్పి కొడుతున్నారన్నారు. ఎలాంటి కుట్రలు పన్నినా రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌ వైపే ఉన్నారని ఆయన గుర్తు చేశారు.

Updated Date - 2022-12-31T22:57:01+05:30 IST