అక్రమ కేసులపై జ్యుడీషియల్‌ విచారణ జరపాలి

ABN , First Publish Date - 2022-03-06T05:24:11+05:30 IST

పాల మూరులో అమాయకులపై పెట్టిన అక్రమ కేసులపై, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యకు కుట్ర పేరుతో ఆడు తున్న అక్రమ కేసుపై జ్యుడీషియల్‌ విచారణ జరపా లని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేంద ర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

అక్రమ కేసులపై జ్యుడీషియల్‌ విచారణ జరపాలి
మాట్లాడుతున్న జితేందర్‌రెడ్డి

- బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి డిమాండ్‌

- పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో మహాధర్నా


మహబూబ్‌నగర్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): పాల మూరులో అమాయకులపై పెట్టిన అక్రమ కేసులపై, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యకు కుట్ర పేరుతో ఆడు తున్న అక్రమ కేసుపై జ్యుడీషియల్‌ విచారణ జరపా లని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేంద ర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, పాలమూరులో జరుగుతున్న అక్ర మ నిర్బంధాలకు నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో శనివారం నిర్వ హించిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. అక్రమ కేసుల అంశంపై ఢిల్లీ వెళ్లి హోంమంత్రి అమిత్‌షాకి అన్నీ వివ రిస్తామ ని, ఇందులో పాత్రదారులు, సూత్రదారుల విషయాలన్నీ కేంద్రా నికి తెలియజేసి వారి నాటకాలు బయటపెడతామని చెప్పారు. శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యాప్రయత్నం ఎందుకు జరుగుతుందని, అమరేందర్‌రాజు, మున్నూరు రవి మీ పార్టీ వాళ్లే అయినప్పుడు నిన్ను ఎందుకు హత్య చేస్తారని ప్రశ్నించారు. మీకు, వారికి ఉన్న పంచాయితీ రాజకీయ పదవులదా?, లేక ఆస్తులదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్‌ మర్చిపోయా రేమో గానీ, జితేందర్‌రెడ్డి మర్చిపోరని చెప్పారు. మున్నూరు రవి తనకు ఉద్యమ సమయం నుంచి తెలుసని, అదే చొరవతో ఢిల్లీలో తన ఇంటికి వెళ్లారని, తన డ్రైవర్లు, పీఏలు ఎందుకు వ చ్చారని అడగరని పేర్కొన్నారు. మంత్రిపై హత్యకుట్ర వందశా తం ఫేక్‌ కేసు అని తాజా సర్వేలో లక్షల మంది పేర్కొన్నారని తెలిపారు. ఇక్కడి పోలీసులు తమాషాలు చేస్తున్నారని మండిప డ్డారు. యూనిఫామ్‌ ఇజ్జత్‌ కాపాడాలని అన్నారు. జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు ఆచారి మాట్లాడుతూ పాలమూరులో శ్రీనివాస్‌గౌడ్‌, ఆయన సోదరుడి అరాచకాలు, కబ్జాలు అందరికీ తెలుసని అన్నారు. శ్రీనివాస్‌ గౌడ్‌ తమ్ముడి అరాచకాలపై రాస్తే వంద పేజీల పుస్తకం అవుతుందని అన్నారు. ప్రజల్లో ఆదరణ కోల్పోయారని, సానుభూతి పొందేందుకే ఈ హత్యకుట్ర కేసు నాటకం మొదలుపెట్టారని ఆరోపించారు. నియంత పాలనను గద్దె దించుతారని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మ చారి అధ్యక్షతన జరిగిన మహాధర్నాలో బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్‌, ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌గౌడ్‌, నాగూరావు నామాజీ, డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి, భరత్‌గౌడ్‌, రతంగ్‌ పాం డురెడ్డి, శ్రీనివాసులు, పడాకుల బాలరాజు, పద్మజారెడ్డి, రాజేంద ర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-06T05:24:11+05:30 IST