ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2022-03-06T04:28:52+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయా లని టీడీపీ నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజ కవర్గ అధ్యక్షుడు బొలమోని రాములు డిమాండ్‌ చేశారు.

ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలి
కలెక్టరేట్‌ ఏవోకు వినతిపత్రం ఇస్తున్న టీడీపీ నాయకులు

-  టీడీపీ నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బొలమోని రాములు

వనపర్తి టౌన్‌, మార్చి5: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయా లని టీడీపీ నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజ కవర్గ అధ్యక్షుడు బొలమోని రాములు డిమాండ్‌ చేశారు. టీడీపీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ ముందు టీడీపీ నాయకులు ధర్నా చేశారు. అనం తరం కలెక్టరేట్‌ ఏవోకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిస్వాల్‌ కమి టీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో లక్ష 91 వేల ఉద్యో గాలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క నోటీఫికేషన్‌ కూడా విడుదల చేయలేదని విమర్శించారు. కానీ కేసీఆర్‌ మాత్రం తన బిడ్డను బిర్లా, కొడుకును టాటా, అల్లుడును అంబానీలుగా చేశారు తప్ప, నిరుద్యోగులను పట్టించుకోలేదని మండిపడ్డారు. నిరుద్యోగులకు నెలకు రూ. 3016 నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కేసీఆర్‌ మూడెళ్లు గడిచినా ఆ పథకాన్ని అమలు చేయ డం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేసి, ఆత్మహత్య లు చేసుకున్న నిరుద్యోగ కుటుంబాలను ఆదుకో వాలని, నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చే యాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు నందిమల్ల అశోక్‌, డాక్టర్‌ పగిడాల శ్రీనివాస్‌, కిషోర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సుధాకర్‌నాయుడు, వెంకటయ్య యాదవ్‌, నంది మల్ల శారద, ఏర్పుల రవియాదవ్‌, దస్తగిరి,  గౌస్‌, గోపాలకృష్ణ నాయుడు, వహీద్‌, వాకిటి నాగరాజు, ఎండీ ఫజల్‌, శ్రీనివాస్‌గౌడ్‌, వాకిటి నారాయణ, బాలునాయుడు, కొత్తగొల్ల శంకర్‌, అమరేందర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more