ఉద్యోగ భద్రత కల్పించాలి

ABN , First Publish Date - 2022-07-19T04:59:55+05:30 IST

ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ సంఘం యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు బి.చంద్రకాంత్‌, సీఐటీ యూ రాష్ట్ర నాయకుడు కిల్లెగోపాల్‌ డిమాండ్‌ చేశా రు.

ఉద్యోగ భద్రత కల్పించాలి
తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేస్తున్న ఆశ వర్కర్లు

- ఆశ వర్కర్ల యూనియన్‌ 

  జిల్లా గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్‌

- తెలంగాణ చౌరస్తాలో ధర్నా

పాలమూరు, జూలై 18 : ఆశ వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆ సంఘం యూనియన్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు బి.చంద్రకాంత్‌, సీఐటీ యూ రాష్ట్ర నాయకుడు కిల్లెగోపాల్‌ డిమాండ్‌ చేశా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. అంతకుముందు గా మునిసిపల్‌ కార్యాలయం నుంచి ఆశవర్కర్లు  అధిక సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అన్ని పీహెచ్‌సీల నుంచి ఆశలు తరలివచ్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో ఆశవర్కర్ల సేవలను డబ్ల్యూహెచ్‌వో గుర్తిచిందన్నారు. సప్రీం కోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీసం వేతనం రూ.24వేలు ఇవ్వాలని తీర్పునిచ్చి నా అమలుకు నోచుకోవటం లేదన్నారు. వెంటనే అ మలు చేయాలని కోరారు. ఆశ వర్కర్స్‌ యూనియ న్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యాదమ్మ, సాధన మాట్లాడుతూ తమకు ఉద్యోగభద్రత కల్పించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, పెన్షన్‌ సౌకర్యం కల్పించాలన్నారు. ఆశ వర్కర్లపై పని భారం పెరిగింది, కనీస వేతనాలు అమలు లేదని,  అధికారుల వేధింపులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాకాలంలో తమ ప్రాణాలకు లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలు రక్షించేందుకు పని చేసినా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించటం లేదన్నారు. 32 రకాల రిజిస్టర్లు ప్రింట్‌ చేసి ప్రభుత్వం సప్లై చేయాలన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు పద్మ, భాగ్య, సునీత, మహాలక్ష్మీ, సావిత్రి, భువనేశ్వరి, నాయేదబేగం, చంద్రకళ, అనురాధ, సుగుణ, నరసమ్మ, చంద్రరేఖ, లక్ష్మి, సరోజ, సునీత, అలివేలు, అధికసంఖ్యలో ఆశవర్కర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-19T04:59:55+05:30 IST