వెట్టి చాకిరీ చేయించుకోవడం విచారకరం

ABN , First Publish Date - 2022-12-16T23:04:12+05:30 IST

ఆశ వర్కర్లతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకోవడం విచార కరమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

వెట్టి చాకిరీ చేయించుకోవడం విచారకరం
డీఐవోకు వినతి పత్రం అందిస్తున్న ఆశవర్కులు, నాయకులు

- సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్‌రెడ్డి

- రెండోరోజు కొనసాగిన ఆశ వర్కర్ల ధర్నా

నారాయణపేట, డిసెంబరు 16: ఆశ వర్కర్లతో ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకోవడం విచార కరమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయం ముందు రెండవ రోజు శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశవర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వంటావార్పు చేపట్టారు. అనంతరం వెంకట్రామ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రకరకాల సర్వేల పేరుతో ఆశవర్కర్లను ఉదయం 6నుంచి రాత్రి 8 గంటల వరకు వెట్టిచాకిరీ చేయించుకుంటోందని ఆరోపించారు. గర్భిణులు, బాలింతల సంక్షేమానికి కృషి చేస్తూ ప్రాణాలకు తెగించి కరోనా సమయంలో సేవలు అందించిన ఆశలను గుర్తించకపోవడం తగదన్నారు. మూడునెలల పాటు ఇవ్వాల్సిన ప్రోత్సాహకం అందించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డీఐవో శైలజకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆశవర్కర్ల సంఘం అధ్యక్షురాలు బాలమణి, సీఐటీయూ ఉపాధ్యక్షుడు జోషి, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నాయకుడు కృష్ణయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:04:15+05:30 IST