స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-08-05T04:51:58+05:30 IST

స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో దేశభక్తి పెం పొందించేలా ఈనెల 8 నుంచి 20వ తేదీ వరకు భారత స్వా తంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా జిల్లా అధికారులను ఆదేశించారు.

స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా

- కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా 

 

వనపర్తి అర్బన్‌, ఆగస్టు 4: స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో దేశభక్తి పెం పొందించేలా ఈనెల 8 నుంచి 20వ తేదీ వరకు భారత స్వా తంత్య్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా జిల్లా అధికారులను ఆదేశించారు. గురువా రం ఐడీవోసీ సమావేశ మందిరంలో భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై వజ్రోత్సవాల కమిటీ జిల్లా స్థాయి అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ఆగస్టు 15వ తేదీన ప్రతీ ఇంటి పై జాతీయ జెండా ఎగరవేసేలా, కార్యక్రమాన్ని విజయవం తం చేసేలా అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు సూ చించారు. ఈనెల 9వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా జాతీయ పతాకాల పంపిణీని చేపట్టాలని తెలిపారు. కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అధికారులు, ప్రజలు సమన్వ యంతో పనిచేయాలని ఆమె సూచించారు. వజ్రోత్సవ వేడు కల ప్రారంభోత్సవ కార్యక్రమం ఆగస్టు 8న ప్రారంభమవు తుందని ఆమె వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌(లోకల్‌బాడీ), వేణుగోపాల్‌(రెవెన్యూ), జిల్లా అధికారులు, ఎంపీపీలు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-05T04:51:58+05:30 IST