అర్హులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-09-22T05:01:18+05:30 IST

జిల్లాలోని నిరుపేద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అర్హులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
మాట్లాడుతున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌

- తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌

- ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ధర్నా

నారాయణపేట, సెప్టెంబరు 21 : జిల్లాలోని నిరుపేద అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో నారాయ ణపేట పుర పార్కు ముందు బుధవారం మహాధర్నా నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భవించి ఎనిమిదేళ్లు అవుతున్నా డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు కాలేదని, పెరుగుతున్న ధరలతో కుటుంబ పోషణ కరువై, అద్దె ఇంట్లో జీవనం కొనసాగించడం కష్ట సాధ్యంగా ఉందన్నారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వెంకట్రామ్‌ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం గోపాల్‌, సీఐటీ యూ జిల్లా కార్యదర్శి బాల్‌రామ్‌, రైతు సంఘం జి ల్లా కన్వీనర్‌ అంజిలయ్య గౌడ్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు బాలప్ప తదితరులు మా ట్లాడారు. ప్రభుత్వ స్థలాల్గో గుడిసెలు వేసుకున్న వారికి స్థలాలు ఇవ్వాలని, స్థలాలు లేని అర్హులైన వారికి ఇంటి స్థలం ఇచ్చి నిర్మాణానికి ఆర్థిక  సా యం అందించాలన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు ఇవ్వాలని, వల్లంపల్లి శివారు 67, 48 సర్వే నంబర్లలో 1,050 మందికి పట్టాలు ఇచ్చారని వారికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్‌ అధికారి రాణికి అందించారు. ధర్నాలో ప్రజా సంఘాల పోరాట వేదిక నాయకులు, కార్యకర్తలు కాశప్ప, జోషి, లాలూ, దస్తప్ప తదితరులు పాల్గొన్నారు


Read more