ఘనంగా దత్తాత్రేయ స్వామి జయంతి

ABN , First Publish Date - 2022-12-07T22:46:06+05:30 IST

జిల్లా వ్యాప్తంగా బుధవారం దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా దత్తాత్రేయ స్వామి జయంతి
మంథన్‌గోడ్‌ దత్తాత్రేయస్వామి రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

నారాయణపేట, డిసెంబరు 7 : జిల్లా వ్యాప్తంగా బుధవారం దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సుభాష్‌రోడ్‌ సద్గురు అవధూత నరసింహా స్వామి మఠంలో అవధూత నరసింహా స్వామికి ఉదయం పాదుకపూజ, రుద్రాభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారం రోజులుగా కొనసాగిస్తున్న దత్తపారాయణం ముగింపు సందర్భంగా దత్త, రుద్ర, గాయత్రి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం మహిళలు దత్తాత్రేయ స్వామికి డోలారోహణం చేపట్టి భక్తి గీతాలు ఆలపించారు. మహా మంగళహారతి అనంతరం అన్నదానం చేశారు. అవధూత నరసింహా స్వామి మఠం కమిటీ సభ్యులు, సేవాదళ్‌, దత్త భక్తులు పాల్గొన్నారు. 2వ వార్డు బ్రహ్మణ్‌ వాడీ దత్తాత్రేయ ఆలయంలో డోలా రోహణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పురోహితులు మంజూనాథ్‌ జోషి, బాబురావు, కౌన్సిలర్‌ జొన్నల అనిత సుభాష్‌ పాల్గొన్నారు. మాత మరిగమ్మ ఆలయంలో దత్తాత్రేయ స్వామి డోలారోహణం, పల్లకీ సేవ, యజ్ఞం నిర్వహించి భక్తులకు అన్నదానం చేపట్టారు.

కొనసాగుతున ్న పారాయణం..

మాణిక్యగిరి కొండకింద కొలువైన దత్తాత్రేయ స్వామి ఆలయంలో గురుచరిత్ర పారాయణం, దత్త యాగం ఆలయ ట్రస్ట్‌ కార్యదర్శి కృష్ణ కోర్వార్‌ ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ సందర్భంగా మాతా మాణికేశ్వరి పాదుకపూజ చేశారు. కృష్ణ కోర్వార్‌ వీణ, జ్ఞానేశ్వర్‌, సురేఖ శైలేందర్‌, మోహన్‌రావు పాల్గొన్నారు.

మక్తల్‌ రూరల్‌ : వల్లభాపురం దత్త పీఠంలో దత్త జయంతి ఉత్సవాలు బుధవారం కొనగాయి. ఈ సందర్భంగా ఉదయం 4 గంటలకు మహా మంగళహరతి, 7 గంటలకు 64 సుగంధ ద్రవ్యాలతో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఉయ్యాల పూజ, దత్తహోమం, మాల విరమణ, ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదానం చేశారు. మంతన్‌గోడ్‌ శివారులోని దత్తత్రేయస్వామి ఆలయంలో దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా స్వామికి అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దత్త పీఠం ట్రస్టు సెక్రటరి రామలింగారెడ్డి, పూజారి కృష్ణప్రసాద్‌ జోషి పాల్గొన్నారు.

కనుల పండువగా రథోత్సవం

మక్తల్‌ : మండలంలోని మంథన్‌గోడ్‌ సమీపంలో వెలసిన దత్తాత్రేయస్వామి (మహనీయపురం) ఆలయం వద్ద బుధవారం రథోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. ఉదయం అభిషేకం, అర్చనలు, హోమం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవ మూర్తికి ఊరేగింపు నిర్వహించిన అనంతరం డోలారోహణం చేపట్టి అన్నదానం చేశారు. సాయంత్రం 5.30 గంటలకు ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా రథం వద్దకు తీసుకువచ్చి పూజలు చేశారు. అనంతరం భక్తుల కోలాహలం మధ్య రథాన్ని ముందుకు లాగారు. జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, బీజేపీ రాష్ట్ర నాయకుడు కొండయ్య, కాంగ్రెస్‌ నాయకుడు వి.శ్రీహరి, మంథన్‌గోడ్‌ సర్పంచు మహదేవమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు సుమిత్ర, మాజీ ఎంపీటీసీ వెంకట్రాములు, ఉప సర్పంచు కృష్ణయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T22:46:08+05:30 IST