ఘనంగా మల్లు రవి జన్మదినం

ABN , First Publish Date - 2022-07-15T05:02:47+05:30 IST

మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లు రవి జన్మదిన వేడుకలను జిల్లాలో పలుచోట్ల ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.

ఘనంగా మల్లు రవి జన్మదినం
మల్లు రవికి శుభాకాంక్షలు తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకుల్చు

మహబూబ్‌నగర్‌/ జడ్చర్ల/ మిడ్జిల్‌, జూలై 14 : మాజీ ఎంపీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ మల్లు రవి జన్మదిన వేడుకలను జిల్లాలో పలుచోట్ల ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌, మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు బెక్కరి అనిత, నాయకులు సంజీవ్‌ముదిరాజ్‌ సీజే బెనహర్‌, మఽధసూదన్‌రెడ్డి తదితరులు హైదరాబాద్‌కు వెళ్లి మల్లు రవిని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జడ్చర్ల, మిడ్జిల్‌ మండలాల్లోనూ మల్లురవి జన్మదిన వేడుకలు జరిపారు. 

జడ్చర్ల అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద కాంగ్రెస్‌పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి, మిఠాయిలు పంపిణీ చేశారు. బాదేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. సత్యేశ్వర ఆశ్రమంలోని మానసిక దివ్యాంగులకు అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బుర్ల వెంకటయ్య, బుక్క వెంకటేశ్‌, మినాజ్‌, నిత్యానందం, అశోక్‌ యాదవ్‌, యాదయ్య, కరాటే శ్రీను, శేఖర్‌, పర్శవేది, నరసింహయాదవ్‌, రఘు, విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మిడ్జిల్‌లో కాంగ్రెస్‌ నాయకులు కేక్‌కట్‌ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. కార్యక్ర మంలో ఎంపీపీ కాంతమ్మ, పార్టీ మండల అధ్యక్షుడు అల్వాల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గౌస్‌, నాయకులు సంపత్‌కుమార్‌, సాయిలు, రామ్‌గౌడ్‌, అశోక్‌, పర్వతాలు, రాములు, జహిర్‌, హరిగౌడ్‌, శివగౌడ్‌, బీరయ్య, రమేష్‌, బాలస్వామి, కృష్ణ, శివ. నరసింహగుప్తా, బాల్‌రెడ్డి, వెంకటయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-15T05:02:47+05:30 IST