చేనేత వస్త్రాలు భారతీయ సంస్కృతికి ప్రతిరూపం
ABN , First Publish Date - 2022-08-08T05:10:12+05:30 IST
దేశ స్వాతంత్య్ర పోరా టంలో కీలక భూమిక పోషించిన చేనేత వస్ర్తాలు భారతీయ సంస్కృతికి ప్రతిరూపంగా నిలిచాయని జడ్పీ చైర్పర్సన్ సరిత అన్నారు.

- జడ్పీ చైర్పర్సన్ సరిత
- చేనేత రంగానికి
ప్రభుత్వం పూర్తి తోడ్పాటు
- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
- ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
గద్వాల టౌన్, ఆగస్టు 7 : దేశ స్వాతంత్య్ర పోరా టంలో కీలక భూమిక పోషించిన చేనేత వస్ర్తాలు భారతీయ సంస్కృతికి ప్రతిరూపంగా నిలిచాయని జడ్పీ చైర్పర్సన్ సరిత అన్నారు. జాతీయ చేనేత ది నోత్సవాన్ని పురస్కరించుకుని చేనేత జౌళిశాఖ ఆధ్వ ర్యంలో ఆదివారం పట్టణంలో నిర్వహించిన ర్యాలీని స్థానిక కృష్ణవేణి చౌరస్తావద్ద జడ్పీ చైర్పర్సన్ ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత వస్ర్తాలను ధరించి నేత కార్మికులకు అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం బాలభవన్‌లో ఏర్పాటు చేసిన చేనేత దుస్తుల స్టాల్ ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జడ్పీ చైర్ప ర్సన్, మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ చేనేత రంగం అభివృద్ధికి టీఆర్ ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను రూపొందించింద న్నారు. ఈ ఏడాది రైతుబీమా తరహాలోనే చేనేత బీమాను అమలుచేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిం దన్న ఎమ్మెల్యే, ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నేతన్నల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కాగా, గద్వాల చేనేత చీరలకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిం దన్న ఎమ్మెల్యే, గద్వాల నేత కళాకారులకు ప్రభుత్వం తరఫున అన్నివిధాలా తోడ్పాటు అందేలా తాను కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా చేనేత వృత్తిలో నైపు ణ్యం ఉన్న పలువురు కార్మికులను జడ్పీ చైర్పర్సన్, మునిసిపల్ చైర్మన్లతో కలిసి ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాజోలి చేనేత సహకార సంఘానికి రూ.11.43లక్షలు, నేతన్న చేయూత పథకం కింద కార్మికులకు పావ లా వడ్డీ ద్వారా అందించే రూ.1,13,06, 200ల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో వ్య వసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రా మేశ్వరమ్మ, చేనేత జౌళిశాఖ ఏడీ గోవిందయ్య, డీపీఆర్ఓ చెన్నమ్మ, జడ్పీటీసీ రాజ శేఖర్, ఎంపీపీ విజయ్‌కుమార్, కౌన్సిలర్ నాగిరెడ్డి, వెంకట్రా ములు, రాధ పాల్గొన్నారు.
చేనేత కళాకారులను ఆదుకోవాలి
చేనేత చీరలకు ప్రసిద్ధిగాంచిన గద్వాలకు చెందిన వృత్తి కళాకారులకు మరింత ప్రోత్సాహం అందేలా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు పులిపాటి వెంకటేష్ కోరారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించు కుని ఆదివారం పట్టణంలోని భక్తమార్కండేయ కల్యాణ మండపం వద్ద పద్మ శాలి సంఘం ఆధ్వర్యంలో చేనేత జెండాను ఎగురవేశా రు. ఈ సందర్భంగా పులిపాటి వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత బీమా పథ కాన్ని ప్రవేశపెట్టడాన్ని స్వాగ తిస్తూ రైతుబంధు తరహాలో నే చేనేతబంధును కూడా అ మలు చేసి కార్మికులను ఆదు కోవాలని కోరారు. కార్యక్రమం లో మునిసిపల్ మాజీ చైర్ప ర్సన్ అక్కల రమాసాయిబాబ, చేనేత పట్టు వస్ర్తాల వ్యాపారులు పుట్ట శ్రీనివాస్, మ్యాడం రామకృష్ణ, చిలువేరి ప్రభాకర్, సాయిబాబ, కృష్ణ, లక్ష్మీనారాయణ, గోపాల్ పాల్గొన్నారు.
రాజోలి చేనేత కార్మికుల సంఘం ఆధ్వర్యంలో..
రాజోలి: జాతీయ చేనేత కార్మికుల దినోత్సవాన్ని ఆదివారం రాజోలిలోని చేనేత కార్మికులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజోలిలోని అడివేశ్వర స్వామి దేవాలయం నుంచి చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బస్టాం డ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి సీనియర్ చేనేత కార్మికుడు దూళ్ల రాముడు పూలమాల వేశారు. అనంతరం గాంధీ చౌక్‌లో గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచు గోపాల్, కుర్ని చేనేత సంఘం అధ్యక్షుడు పి. వెంకటేశ్వర్లు, నాయకులు దస్తగిరి, మూగన్న, నిషాక్, నేతన్నలు సత్యనారాయణ, విశ్వనాథం, రామస్వామి, పి. వెంకటేశ్వర్లు, గోపాల్ పాల్గొన్నారు.