గ్రూప్‌-1 పరీక్షకు ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2022-10-08T04:52:41+05:30 IST

జిల్లాలో ఈనెల 16న నిర్వహించే గ్రూప్‌-1 పరీక్షలను పక డ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ హరిచందన అధికారులను ఆదేశించారు.

గ్రూప్‌-1 పరీక్షకు ఏర్పాట్లు చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరిచందన

- కలెక్టర్‌ హరిచందన

- పరీక్ష నిర్వహణపై అధికారులతో జూమ్‌ మీటింగ్‌


నారాయణపేట టౌన్‌, అక్టోబరు 7: జిల్లాలో ఈనెల 16న నిర్వహించే గ్రూప్‌-1 పరీక్షలను పక డ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ హరిచందన అధికారులను ఆదేశించారు. శుక్రవారం సంబంధిత పరీక్షల నిర్వహణపై ఎస్పీ వెంకటేశ్వర్లు, అధికారులతో ఆమె జూమ్‌ సమా వేశం నిర్వహించి, మాట్లాడారు. జిల్లాలో 2184 మంది అభ్యర్థులు గ్రూప్‌-1 పరీక్షలు రాయనున్నా రని ఇందుకు ఏడు కేంద్రాలను టీఎస్‌పీఎస్‌సీ ద్వారా గుర్తించామని అన్నారు. అన్ని కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, ప్రథమచికిత్స, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పరీక్ష రోజు కేంద్రాల ఆవరణలో 144 సెక్షన్‌ అమలుతో పాటు, జిరాక్స్‌ సెంటర్లు మూసి ఉంచాలని, పోలీస్‌శాఖ తరపున బందో బస్తు చేపట్టాలని సూచించారు. సీసీ టీవీల పర్య వేక్షణలో ప్రశ్నపత్రాలు తెరిచేలా చూడాలని, 20శాతం ఇన్విజిలేటర్లను నియమించి వారికి శిక్ష ణ ఇవ్వాలన్నారు. పరీక్ష నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ పద్మజారాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Read more