ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-09-30T05:02:12+05:30 IST

పట్టణంలోని వాసవీ కన్యకా పర మేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్యులు నాలుగోరోజు దేవీ శరన్నవరాత్రి ఉత్సవా లను ఘనంగా జరుపుకున్నారు.

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేస్తున్న చైర్మన్‌ గట్టుయాదవ్‌

వనపర్తి రాజీవ్‌చౌరస్తా, సెప్టెంబరు 29: పట్టణంలోని వాసవీ కన్యకా పర మేశ్వరి దేవాలయంలో ఆర్యవైశ్యులు నాలుగోరోజు దేవీ శరన్నవరాత్రి ఉత్సవా లను ఘనంగా జరుపుకున్నారు. అమ్మవారిని వారాహిదేవిగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షుడు గోనూరు యాదగిరి, అధ్యక్షుడు ఆకుతోట దేవరాజు, కోశాధికారి దాచ శివ, నాయకులు గుమ్మడవెల్లి మహేష్‌, సోమిశెట్టి, వెంకటేష్‌శెట్టి, ప్రవీణ్‌, ఆర్యవైశ్య సహాయనిధి చైర్మన్‌ గట్టుశశి, వైస్‌ చైర్‌పర్సన్‌ మంజుల, మహిళా సంఘం అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి, ప్రధాన కార్యదర్శి అనంత ఉమావతి, కోశాధికారి గుబ్బ మాధవి, అదనపు మహిళా ప్రధాన కార్యదర్శి కొండూరు మంజుల తదిత రులు పాల్గొన్నారు.     

 దుర్గామాతను దర్శించుకున్న చైర్మన్‌ 

వనపర్తి టౌన్‌ : పట్టణంలోని వెంగళరావుకాలనీ పార్కులో కొలువుదీరిన దుర్గామాతను గురువారం మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌ దర్శించుకున్నారు. అన్నపూర్ణాదేవి ఆవతారంలో దర్శనమిచ్చిన దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్కులో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కౌన్సిలర్లు పెండెం నాగన్నయాదవ్‌, లక్ష్మిదేవమ్మ, వినోద్‌ గౌడ్‌, శివగౌడ్‌, నిర్వాహకులు మురళి, సంతోష్‌, మాధవరెడ్డి, నీలమ్మ, అలేఖ్య, కోట్ల శిరీష, క్రాంతి, రాజేష్‌, రాకేష్‌, కృష్ణరెడ్డి, శేఖర్‌గౌడ్‌, ఝాన్సీ పాల్గొన్నారు. 

 అమ్మవారి పూజల్లో బీజేపీ నాయకులు 

వనపర్తి అర్బన్‌ : మండల పరిధిలోని చిట్యాల గ్రామ ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో దుర్గామాత సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన మండ పంలో నాల్గవరోజు బాలాత్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిచ్చారు. నిర్వాహకుల ఆహ్వానం మేరకు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.నారాయణ దంపతులు, జిల్లా అధికార ప్రతినిధి పెద్దిరాజు దంపతులు కుటుంబ సమేతంగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంజనేయస్వామి ఆలయ పూజారి సిద్ధాంతి నవీన్‌ శర్మ, నరేందర్‌శెట్టి గురుస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. జంగిడి వెంకటయ్య, రాజశేఖర్‌శెట్టి, కృష్ణమో హన్‌శెట్టి నిర్వాహకులు వెంకటేష్‌, నరసింహ, వినోద్‌, లక్ష్మినారాయణ, చంద్ర శేఖర్‌, భాను, నందకిశోర్‌, నవీన్‌, అరవింద్‌, శివ, నరేష్‌, భాస్కర్‌, నరేష్‌ తదిత రులు పాల్గొన్నారు.    

 అన్నపూర్ణాదేవిగా అమ్మవారు  

ఆత్మకూర్‌ : మండల కేంద్రంలో పలుచోట్ల ఏర్పాటుచేసిన దుర్గామాత గురువారం అన్నపూర్ణాదేవిగా అవతారం ఇచ్చారు. కోట్ల బాల ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతిష్టించిన అమ్మవారికి మాజీ ఎంపీపీ డాక్టర్‌ శ్రీధర్‌గౌడ్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, కౌన్సిలర్లు రామకృష్ణ, మోషన్‌, చెన్నయ్య, పోషన్న పాల్గొన్నారు.  

- కొత్తకోట : పట్టణంలోని అంబాభవానీ మాత, భక్త మార్కండేయ స్వామి దేవాలయంలోని పార్వతిదేవి, కన్యకాపరమేశ్వరీ ఆలయంలోని వాసవి మాత, కానాయపల్లి గ్రామ శివారులోని జ్ఞానాంబికాదేవి అమ్మవార్లు అన్న పూర్ణాదేవిగా దర్శనం ఇచ్చారు. అలాగే, పట్టణంలోని పాత కాలేజి, దండుగడ్డ, శిశుమందిర్‌ కాలనీల్లో ఏర్పాటుచేసిన దేవీ మండపాల్లో భక్తులు ప్రత్యేక పూ జలు చేశారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు. 

- అమరచింత : పట్టణంలోని విఘ్నేశ్వర భవానీనగర్‌, సంతోష్‌నగర్‌, జగన్‌వాడ, గణేష్‌నగర్‌లలో భక్తులు ప్రతిష్ఠించిన దుర్గామాత అన్నపూర్ణా దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. విఘ్నేశ్వర భవానీనగర్‌లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు క్యామ భాస్కర్‌ జ్యోతి దంపతులు దుర్గామాతకు పూజలు చేశారు. కార్యక్రమంలో తిరుమల ప్రకాష్‌, నవీన్‌, రాజు, మహిళలు పాల్గొన్నారు.

 గాయిత్రీదేవిగా అమ్మవారు  

గోపాల్‌పేట : మండల కేంద్రంలోని చెన్నకేశవ ఆలయం ముందు ఏర్పాటు చేసిన కనకదుర్గ అమ్మవారిని మూడో రోజు రంగాచార్యులు పండితుల ఆధ్వ ర్యంలో అమ్మవారిని గాయిత్రీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. కార్య క్రమంలో నిర్వాహకులు శివరాజు, చంద్రశేఖర్‌, దిలీప్‌ తదితరులు పాల్గొన్నారు. 

 లలితాదేవిగా అమ్మవారు

పాన్‌గల్‌ : దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని కేతేపల్లి కన్యకాపరమేశ్వరి ఆలయంలో గురువారం అమ్మవారు లలితాదేవిగా దర్శన మిచ్చారు. ఆర్యవైశ్య సంఘం నాయకులు, మహిళలు అమ్మవారికి కుంకు మార్చన, అభిషేకం తదితర పూజలు చేశారు. Read more