మూడు నెలల్లో మహమ్మదాబాద్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల
ABN , First Publish Date - 2022-12-16T23:42:56+05:30 IST
మూడు నెలల్లో మహమ్మదాబాద్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి అన్నారు.
- పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి
మహమ్మదాబాద్, డిసెంబరు 16 : మూడు నెలల్లో మహమ్మదాబాద్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయనున్నట్లు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాల యంలో మహమ్మదాబాద్, గండీడ్ మండలానికి సంబంధించిన కల్యాణ లక్ష్మి, షాదీముబాక్ లభ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడ్డ తర్వాత దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి కారక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారన్నారు. వచ్చేఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య, మహమ్మదా బాద్ సర్పంచ్ పార్వతమ్మ, గాదిర్యాల్ సర్పంచ్ వెంకట్‌రామ్‌రెడ్డి, జూలపల్లి సర్పంచ్ కిరణ్‌కుమార్‌రెడ్డి, మంగంపేటతండా సర్పంచ్ గీతాపాండు, ఎంపీటీసీ చెన్నయ్య, మహమ్మదాబాద్, గండీడ్ తహసిల్ధార్‌లు ఆంజనేయులు, జ్యోతి, రైతుసమన్వయ సమితి అధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, నాయకులు రాజేశ్వర్, గోపాల్‌రెడ్డి, భిక్షపతి నాయకులు పాల్గొన్నారు.