రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-12-14T23:24:37+05:30 IST

రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని, రైతుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఅర్‌ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
ఎద్దుల గిరక బండ్ల పోటీలను ప్రారంభిస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత

- జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత

- గిరక బండ్ల పోటీలు ప్రారంభం

గట్టు, డిసెంబరు 14 : రైతు సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని, రైతుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఅర్‌ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. మండల పరిధిలోని ఇందువాసి శివారులో అల్లావుద్దీన్‌సాబ్‌ ఉర్సు సందర్భంగా బుధవారం నిర్వహించిన ఎద్దుల గిరక బండ్ల పోటీలను జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత ప్రారంభించారు. అంతకు ముందు అల్లావుద్దీన్‌సాబ్‌ దర్గాను దర్శించుకొని పూజలు చేశారు. కులమతాలకు అతీతంగా నిర్వహించుకునే ఈ ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతికగా నిలుస్తున్నాయని తెలిపారు. ఐకమత్యంగా ఉత్సవాలను విజయవంతం చేసుకోవాలని కోరారు. గిరక బండ్ల పోటీలు నిర్వహించడంపై అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు జడ్పీ చైర్‌పర్సన్‌ను శాలువా, పూలమాలతో సత్కరించారు. పోటీలను తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల బీఅర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-14T23:24:38+05:30 IST