కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు : డీఈవో

ABN , First Publish Date - 2022-12-31T23:20:36+05:30 IST

కార్పొరేటు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌ అన్నారు.

కార్పొరేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు : డీఈవో
భూత్పూర్‌లో స్టాళ్లను పరిశీలిస్తున్న డీఈవో, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి

- జిల్లాలో పలుచోట్ల టీఎల్‌ఎం మేళాలు ప్రారంభం

భూత్పూర్‌, డిసెంబరు 31 : కార్పొరేటు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చి దిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌ అన్నారు. శనివారం భూత్పూర్‌ హైస్కూల్‌ ఆవరణలో మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఏర్పాటు చేసిన టీఎల్‌ఎం (టీచర్‌ లెర్నింగ్‌, మెటీరియల్‌) మేళాను ప్రారంభించడానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. సాయంత్రం ముగింపు కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్‌ హాజరై మేళాను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో నాగయ్య, పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు బాలరాజుగౌడ్‌, ప్రధాన కార్యదర్శి యాదయ్య, భూత్పూర్‌ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు సంగీత, సింగిల్‌ విండో అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ నారాయణగౌడ్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులకు తొలిమెట్టుతో ఎంతో దోహదం

మూసాపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమం చదువులో వెనుకబడ్డ పిల్లలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా విద్యాధికారి రవీందర్‌ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంఆర్‌సీ భవ నంలో ఆయాగ్రామాల పాఠశాలల ఉపాధ్యాయులకు నిర్వహించిన టీఎల్‌ఎం మేళాకు ముఖ్య అథితిగా డీఈవో హాజరై మాట్లాడారు. మేళాను చక్కగా ప్రదర్శించడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. అనంతరం డీఈవోను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈవో రాజేందర్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ వరప్రసాద్‌, ఎంపీపీ గూపని కళావాతీకొండయ్య, జడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్‌, మండల నోడల్‌ అధికారి గోపాల్‌రాజు, వేముల స్కూల్‌ కాంప్లెక్స్‌ అధికారి శ్రీనివాసులు, హెచ్‌ఎంలు లక్ష్మణ్‌ గౌడ్‌, భాస్కర్‌, వెంకటేష్‌, గోవర్ధన్‌రెడ్డి, వనిత, సురేష్‌, సుదర్శన్‌, ప్రకాష్‌ ఉన్నారు.

అట్టహాసంగా టీఎన్‌ఎం మేళా

బాదేపల్లి : పట్టణంలోని జడ్పీహెచ్‌ బాలుర బాదేపల్లి పాఠశాలలో శనివారం భోధనోపకరణాల మేళాను అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన టీఎల్‌ఎం మేళాలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మేళాను జడ్పీవైస్‌ చైర్మన్‌ యాదయ్య, ఎంఈవో మంజులాదేవి ప్రారంభించారు. 64 పాఠశాలల ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు పైన్స్‌పై, గణిత, ఇంగ్లీష్‌పై రూపోందించిన 378 అంశాలకు చెందిన ప్రయోగాలను, పాఠశాల అంశాలను ఉపాధ్యాయులే తయారు చేసి ప్రదర్శించారు. ముగింపు కార్యక్రమానికి డీఈవో రవీందర్‌ హాజరై గెలుపొందిన ఉపాధ్యాయులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ దానిష్‌, కౌన్సిలర్‌ రఘురాంగౌడ్‌, మంజులాదేవి, ఇన్‌చార్జి హెచ్‌ఎం వివేకానంద, నాయకులు ఇమ్ము, శ్రీకాంత్‌, నాగరాజు, ఉపాధ్యాయులు సంఘాల నాయకులు తాహెర్‌, సునీల్‌, గోవింద్‌నాయక్‌, బాబునాయకుడు, కృష్ణ, భాస్కర్‌, కృష్ణయ్య, దేవ్యనాయక్‌, యుగెందర్‌, మల్లయ్య, సరస్వతి, నాగేద్రమ్మ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

బోధనాభ్యసన సామగ్రి మేళా

మిడ్జిల్‌ : మండలంలోని పలు పాఠశాలల విద్యార్థులు తయారుచేసిన వివిధ బోధన సామాగ్రిని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ పాఠశాల అవరణలో మేళాను శనివారం నిర్వహించి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శశిరేఖబాలు, ఎంఈవో మంజులాదేవి, జీహెచ్‌ఎంలు సుధాకర్‌, రవికుమార్‌, ఎంపీటీసీ గౌస్‌, యూటీఎఫ్‌ అధ్యక్షుడు నర్సిములు, పీఆర్‌టీయూ అధ్యక్షులు రాజేందర్‌గౌడ్‌, టీజీయూఎస్‌ మండల అధ్యక్షుడు కృష్ణ, టీయూపీఎస్‌ మండల అధ్యక్షుడు మోహన్‌కుమార్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బోధనాభ్యసనతో విద్యార్థులకు మేలు

నవాబ్‌పేట : బోధనాభ్యసనతో విద్యార్థులకు మేలు జరుతుతుందని జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ అనంతయ్య అన్నారు. శనివారం మండలంలోని 60 పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ప్రదర్శనకు వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్‌ నర్సింహులు, మార్కెట్‌ చైర్మన్‌ లక్ష్మయ్య, సర్పంచ్‌ గోపాల్‌గౌడ్‌, తహసీల్దార్‌ రాజేందర్‌రెడ్డి, ఈ కార్యక్రమంలో ఏఎంవో వెంకట్రామిరెడ్డి, నోడల్‌ అధికారి జగదీష్‌కుమార్‌, జీహెచ్‌ఎంలు ఉషారాణి, రహెనాబేగం పాల్గొన్నారు.

టీఎల్‌ఎం ద్వారానే విద్యార్థులకు బోధించాలి

బాలానగర్‌ : ప్రభుత్వా పాఠశాలల ఉపాధ్యాయులు తప్పనిసరిగా టీఎల్‌ఎం ద్వారానే విద్యార్థులకు బోధించాలని సర్పంచ్‌ విజయలక్ష్మి అన్నారు. శనివారం స్థానిక జడ్పీహెచ్‌ బాలికల పాఠశాలలో మండల స్థాయి తొలిమెట్టు టీఎల్‌ఎం మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయులు తయారు చేసిన టీఎల్‌ఎం సామగ్రిని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈవో, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:20:36+05:30 IST

Read more