సరస్వతీదేవిగా అమ్మవారు

ABN , First Publish Date - 2022-10-03T04:38:17+05:30 IST

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఏడో రోజు నారా యణపేట పట్టణంలోని వివిధ దేవి ఆలయా ల్లో అమ్మవార్లు ప్రత్యేక అలంకరణల్లో దర్శనమి చ్చారు.

సరస్వతీదేవిగా అమ్మవారు
పేటలో సరస్వతీదేవిగా మల్లాంబిక అమ్మవారు

నారాయణపేట, అక్టోబరు 2 : నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఏడో రోజు నారా యణపేట పట్టణంలోని వివిధ దేవి ఆలయా ల్లో అమ్మవార్లు ప్రత్యేక అలంకరణల్లో దర్శనమి చ్చారు. అంబాభవానీ ఆలయం, చౌడేశ్వరి ఆల యం, మల్లాంబిక ఆలయంలో సరస్వతీ దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నారాయణపేట రూరల్‌ : మండలంలోని కోటకొండ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శన మివ్వగా, సింగారం శ్రీగిరి పీఠం భవాని మాత సరస్వతి దేవిగా దర్శనమిచ్చారు. కొల్లంపల్లి, కోటకొండ నర్సాచలం వేంకటేశ్వరస్వామి ఆల యాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మరికల్‌ : మండల కేంద్రంలోని మల్లికా ర్జున భ్రమరాంభిక, కన్యకాపరమేశ్వరి, కాళికాదే వి ఆలయాల్లో అమ్మవారు సరస్వతీదేవిగా భ క్తులకు దర్శినమిచ్చారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో మహిళలు బతుకమ్మ సంబురా లు ఘనంగా నిర్వహించారు. 

దామరగిద్ద : మండల కేంద్రంలోని అంభాభవాని, కన్యకాపరమేశ్వరి అమ్మవారి అమ్మ వారు ఆదివారం సరస్వతీదేవిగా భక్తులకు దర్శ నం ఇచ్చారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మక్తల్‌ :  మక్తల్‌ పట్టణంలో వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాత సర స్వతీదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు.  అమ్మ వారిని సాయంత్రం హంసవాహనంపై ఊరేగించారు. వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వా మివారిని ప్రత్యేక వాహనంపై ఊరేగించారు. నల్లజానమ్మ ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. 





Read more