గోవా లిక్కర్‌ స్వాధీనం, ముగ్గురి అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-12-31T23:18:06+05:30 IST

జోగుళాంబ గద్వాల జిల్లాలో శనివారం ఎక్సైజ్‌ అధికారులు గోవా లిక్కర్‌ను పట్టుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్‌ సీఐ గోపాల్‌ తెలిపారు.

గోవా లిక్కర్‌ స్వాధీనం, ముగ్గురి అరెస్ట్‌
పట్టుకున్న గోవా మద్యంతో ఎక్సైజ్‌ అధికారులు

గద్వాల క్రైం, డిసెంబరు 31: జోగుళాంబ గద్వాల జిల్లాలో శనివారం ఎక్సైజ్‌ అధికారులు గోవా లిక్కర్‌ను పట్టుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎక్సైజ్‌ సీఐ గోపాల్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లా లో గద్వాల డీటీఎఫ్‌, గద్వాల ఎస్‌హెచ్‌వో, అలం పూర్‌ ఎస్‌హెచ్‌వో టీమ్‌లు శనివారం ఉదయం గట్టు మండలం బల్గెర వద్ద రూట్‌వాచ్‌ నిర్వహిస్తుండగా గోవా స్టేట్‌ లిక్కర్‌ కల్గి ఉన్న ప్రకాశం జిల్లా ముండ్లనూర్‌కు చెందిన మేదరమట్ల అనిల్‌కుమార్‌, మేదరమెట్ల నరేంద్రకుమార్‌, నంద్యాల జిల్లా చినరాజుపాలెంకు చెందిన దూదేకు ల హుస్సేన్‌బాషాలను అదుపులోకి తీసుకున్నా మన్నారు. వారి వద్ద నుంచి 750 ఎంఎల్‌ కల్గిన 108 హేవడ్స్‌ విస్కీ, రెండు లీటర్లు కల్గిన 25 రా యల్‌ చాలెంజ్‌ విస్కీ, ఐదు ఐబీ విస్కీ, నాలుగు స్టాగ్‌ బ్రాందీ సీసాలను స్వాధీనం చేసుకొని వా రిని అరెస్ట్‌ చేసినట్లు వివరించారు. మద్యాన్ని వీ రు గోవా నుంచి నంద్యాలకు తరలిస్తుండగా ప ట్టుకున్నట్లు చెప్పారు. దాడుల్లో ఇన్‌స్పెక్టర్‌ బానోత్‌ పటేల్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు మోహన్‌, రాజేందర్‌, గోవర్ధన్‌, హరి, కానిస్టేబుల్స్‌ రవి, నాయుడు, ష బ్బీర్‌, హరిప్రసాద్‌, నవీన్‌, గోవిందు ఉన్నారు.

Updated Date - 2022-12-31T23:18:07+05:30 IST