ఘనంగా పోషమ్మ, గజలమ్మ జాతర

ABN , First Publish Date - 2022-06-08T04:57:53+05:30 IST

జిల్లా కేంద్రంలోని పోషమ్మ, గజలమ్మ జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా పోషమ్మ, గజలమ్మ జాతర
బోనాలతో పోషమ్మ, గజలమ్మ ఆలయాలకు తరలివెళ్తున్న భక్తులు, మహిళలు

  నారాయణపేట, జూన్‌ 7: జిల్లా కేంద్రంలోని పోషమ్మ, గజలమ్మ జాతర  మంగళవారం ఘనంగా నిర్వహించారు.  పట్టణంలోని భక్తులు, మహిళలు అధికసంఖ్యలో తమ ఇళ్లలో ప్రత్యేక వంటకాలతో బోనాలను తయారు చేసుకొని ఆయా అమ్మవార్ల దేవాలయాలకు వెళ్లి  మొక్కలు తీర్చుకున్నారు. కుటుంబసభ్యులు సుఖఃసంతోషాలతో కలిసి మెలిసి ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సంవృద్ధిగా పండాలని అమ్మవార్లను వేడుకున్నారు. అంతకుముందు ఆయా వీధుల నుంచి బోనాలతో మహిళలు, భక్తులుగా డప్పుల మోత, పూనకాలతో ఆలయాలకు తరలివెళ్లారు.  నారాయణపేట అశోక్‌ నగర్‌లో వెలిసిన గజలమ్మ జాతరలో 8వ వార్డు కౌన్సిలర్‌ శిరీష  పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించు కొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మొక్కుబ డులు చెల్లించు కున్నారు. వీరి వెంట ఆలయ ధర్మకర్త లక్ష్మణ్‌, చలపతి, వెంకటేష్‌, కె.నర్సిములు, ఆలయ పూజారులు పాల్గొన్నారు.

బోయిన్‌పల్లి గ్రామంలో.. 

నారాయణపేటరూరల్‌: మండలంలోని బోయిన్‌పల్లి గ్రామంలో గజలమ్మ జారోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అమ్మవారికి బోనాలతో మహిళలు నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో గ్రామస్థులు, పెద్దలు, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

 మక్తల్‌ మునిసిపాలిటీ పరిధిలో..

మక్తల్‌రూరల్‌ : మక్తల్‌ మునిసిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం తా యమ్మ, ఈదమ్మ, మారెమ్మ, కర్రెమ్మ గ్రామ దేవతల కు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మక్తల్‌ మునిసిపాలిటీ పరిధిలోని దండులో గ్రామదేవత మారెమ్మ ఆలయంలో మక్తల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ ఇన్‌చార్జి వాకిటి శ్రీహరి, రాజుల ఆశిరెడ్డి, నాయకులు రాజశేఖర్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించా రు. మారెమ్మ ఆలయంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య, మునిసిపాలిటీ చైర్మన్‌ బాల్చేడ్‌ పావని, మల్లికార్జున్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మధుసూదన్‌రెడ్డి, కల్లూరి నాగప్ప, గొల్లపల్లినారాయణ, అనిల్‌గౌడ్‌  పాల్గొన్నారు.

ఘనంగా లింగమయ్య జాతర

మక్తల్‌ మండలంలోని కర్నీ, పంచదేవపహాడ్‌, పసుపుల, భూత్పూరు గ్రామాల్లో మంగళవారం లింగమయ్య జాతర ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు లింగమయ్య ఆలయానికి అధిక సంఖ్యలో చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వనజ, సర్పంచులు కల్పన, కృష్ణాచారి, దత్తు, ఎంపీటీసీ చన్న రంగప్ప, గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.

ఘనంగా గ్రామ దేవతలకు పూజలు 

మాగనూరు: మాగనూరు మండలంలోని వర్కురు, నేరేడుగొమ్ము, మాగనూరు తదితర గ్రామాల్లో  పోలమ్మ అవ్వ, మారెమ్మ అవ్వ గ్రామ దేవతలకు  ప్రజలు బోనాలు సమర్పించారు. ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి పూజలు చేసి  మొక్కులు చెల్లించుకున్నా రు. కార్యక్రమంలో ఆయా గ్రామ పెద్దలు, నాయకు లు,  మహిళలు  పాల్గొన్నారు.

Updated Date - 2022-06-08T04:57:53+05:30 IST