గడప గడపకు సంక్షేమ పథకాలు
ABN , First Publish Date - 2022-12-16T22:59:18+05:30 IST
రాష్ట్రంలో గడపగడపకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథ కాలు అందజేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.
- వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
వనపర్తి అర్బన్, డిసెంబరు 16: రాష్ట్రంలో గడపగడపకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథ కాలు అందజేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 232 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు, 205 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందజేసి, వారితో కలిసి మంత్రి సహపంక్తి భోజనం చేశారు. ఆ తర్వాత ఆ యన మాట్లాడుతూ రాష్ట్రంలో గడపగడపకు సంక్షే మం, వాడవాడలా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. పే దలకు అండగా కేసీఆర్ సర్కార్ ఉందని, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పేదింటి ఆడబిడ్డలకు వరం అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికి సాయం అందజేస్తామని, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ అని, ప్రపంచ దేశా లకు భారతదేశాన్ని ఆదర్శంగా నిలపాలన్నదే కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు. నాడు రాష్ట్రం కోసం టీఆర్‌ఎస్, నేడు దేశం కోసం బీఆర్‌ఎస్‌గా మారిందన్నారు. బీజేపీ పాలనలో వ్యవసాయం భారంగా మారిందని విమర్శిం చారు. రైతు రాజ్యస్థాపన కోసం రాజీలేని పోరాటం చే స్తామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తదితరులున్నారు.