మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి
ABN , First Publish Date - 2022-10-18T04:17:17+05:30 IST
ప్రభుత్వం అందజేస్తున్న చేప పిల్లలతో మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వనజ అన్నారు.
- ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మక్తల్ రూరల్, అక్టోబరు 17 : ప్రభుత్వం అందజేస్తున్న చేప పిల్లలతో మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ వనజ అన్నారు. సోమవారం మక్తల్ మండలం గడ్డంపల్లి జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కేంద్రంలో 9.60 లక్షల చేప పిల్లలను వారు వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికి అండగా ఉంటుందన్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి ఏడీ రాణాప్రతాప్, ఎంపీపీ వనజ, సర్పంచులు త్రివేణిజ్ఞానేశ్వర్, దత్తు, మత్స్య సంఘం అధ్యక్షుడు చింతకాలయ రాములు, మత్స్యశాఖ సిబ్బంది అనిల్‌కుమార్, మత్స్య సంఘం నాయకులు పాల్గొన్నారు.
కలిసికట్టుగా గ్రామాభివృద్ధికి సహకరించాలి
మాగనూరు : గ్రామాభివృద్ధికి గ్రామ ప్రజలు కలిసికట్టుగా సహకరించి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వర్కూరు గ్రామంలో సోమవారం ఎల్ఈడీ బల్బులతో పాటు టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రైతు వేధికలో సర్పంచు నిర్మలమ్మ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రామాభివృద్ధికి తనవంతు కృషి, సహయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. సంగంబండ రిజర్వాయర్ రైట్ లో లెవెల్ కెనాల్‌ను బాగుచేయించడంతో పాటు అందులో కూడుకుపోయిన మట్టి, పిచ్చి మొక్కలను తొలగించే ఏర్పాటు చేస్తానన్నారు. అనంతరం సర్పంచు నిర్మలమ్మ, వైస్ ఎంపీపీ తిప్పయ్య ఎమ్మెల్యేకు గ్రామ సమస్యలపై వినతి పత్రం అందించి మా ట్లాడారు. వర్కూరు గ్రామంలో నీటి ఊట ఏర్పడుతుందని రైట్ లో లెవెల్ కెనాల్‌కు ఇరువైపులా సిమెంటోతో గోడలు నిర్మించాలన్నారు. గ్రామంలో డ్రైనేజీ సమస్య, అంతర్గత రోడ్ల సమస్య, ప్రభుత్వ పాఠశాలకు ప్రహరీ నిర్మించాలన్నారు. గ్రామంలో 40 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉందని, అలాంటి భూమిలో ఒక గురుకుల పాఠశాల కానీ రైతులు ధాన్యం నిల్వ చేసుకునేందుకు గోదాములు కానీ నిర్మించాలని ఎమ్మెల్యేను కోరారు. అంతకుముందు పలు పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి చేరిన వా రికి కండువా కప్పి ఆహ్వానించారు. జడ్పీటీసీ సభ్యుడు వెంకటయ్య, రైతు సమన్వయ కమిటీ మండలాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, మండలాధ్యక్షుడు ఎల్లారెడ్డి, మాగనూరు, నేరేడుగం సర్పంచులు రాజు, అశోక్‌గౌడ్, శివరాజ్ రెడ్డి, ఉప సర్పంచు కృష్ణయ్య, మాజీ సర్పంచు మారెప్ప, రామకృష్ణారెడ్డి, తిప్పారెడ్డి, రామచంద్రగౌడ్, లక్ష్మప్ప, అనిల్‌రెడ్డి, అశోక్, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.