ఉల్లాసంగా..ఉత్సాహంగా...
ABN , First Publish Date - 2022-08-19T05:44:07+05:30 IST
పదిరోజులనుంచి స్వతంత్ర వజ్రోత్స వాలలో బిజీబిజీగా ఉన్న జిల్లా అధికారులు, ఉద్యోగులు కొద్దిసేపు అంతా మరిచి పోయి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు.
-ఫ్రీడమ్కప్పోటీలను
ప్రారంభించిన కలెక్టర్ హరిచందన
నారాయణపేట టౌన్, ఆగస్టు 18: పదిరోజులనుంచి స్వతంత్ర వజ్రోత్స వాలలో బిజీబిజీగా ఉన్న జిల్లా అధికారులు, ఉద్యోగులు కొద్దిసేపు అంతా మరిచి పోయి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. గురువారం నారాయణపేట క్రీడా మైదానంలో జిల్లా అధికారులు, ఉద్యోగులకు ఫ్రీడమ్ కప్ పోటీలు నిర్వహిం చారు. కలెక్టర్ హరిచందన, జడ్పీ చైర్పర్సన్ వజనతో కలిసి పోటీలను ప్రారం భించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి దోహదపడుతాయన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, షటిల్, బ్యాడ్మింటన్, లాంగ్ జంప్, రన్నింగ్ తదితర పోటీలను నిర్వహించామన్నారు. ఖోఖో పోటీలను కలెక్టర్ టాస్ వేయగా, కబడ్డీ పోటీలను జడ్పీ చైర్పర్సన్ రైడింగ్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పద్మజా రాణి, జిల్లా అధికారులు రాంమనోహర్, శివప్రసాద్, హతిరాం, సీఐ శ్రీకాంత్, ఆర్డీవో రాంచంద్రయ్య, సాయినాథ్, పీఈటీలు, ఉ పాధ్యాయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.