ఘనంగా ఉష్ట్ర వాహన సేవ

ABN , First Publish Date - 2022-12-06T23:10:21+05:30 IST

పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటలకు ఉష్ట్ర వాహనసేవ నిర్వహించారు.

ఘనంగా ఉష్ట్ర వాహన సేవ
ఉష్ట్ర వాహన సేవ నిర్వహిస్తున్న భక్తులు

మక్తల్‌, డిసెంబరు 6 : పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటలకు ఉష్ట్ర వాహనసేవ నిర్వహించారు. అంతకుముందు స్వామివారి మూల విరాట్‌ నుంచి పడమర వైపు ఉన్న చిన్న ఆంజనేయస్వామి విగ్రహం వద్దకు తీసుకువెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటలకు సుప్రభాతం, 8 గంటలకు పంచామృతం, తులసి అర్చన, ఆకుపూజ, 12 గంటలకు మహానివేదన, సాయంత్రం 6 గంటలకు వాహనసేవ, మహా మంగళహారతి, అవతారాలు, ఇత్యాదుల కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పూజారి భీమాచార్య, ప్రాణేషాచారీ, అరవిందాచారీ, భక్తులు మాన్వి రామారావు, వంశీజోషి, గోవిందరావు, భీంరెడ్డి, శ్రీనివాసులు, సత్యనారాయణగౌడ్‌, నర్సింహారెడ్డి, అంజయ్య, అంజన్‌ప్రసాద్‌ పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల బందోబస్తు పరిశీలన

మక్తల్‌ రూరల్‌ : పట్టణంలో పడమటి ఆంజనేయస్వామి బ్రహ్రోత్సవాలను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణం నందు బందోబస్తు ఏర్పాట్లను బుధవారం సీఐ సీతయ్య పరిశీలించారు. మక్తల్‌, ఉట్కూరు, మాగనూరు, కృష్ణ ఎస్‌ఐలు పర్వతాలు, రాములు, నరేందర్‌, విజయభాస్కర్‌తో కలిసి బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించి మాట్లాడారు. మహిళలు ధరించే బంగారు వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని, ప్రత్యేకంగా మహిళల రక్షణ కోసం షీటీం పోలీసులు, దొంగతనాల నిర్మూలనకు మప్టిలో పోలీసులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రథోత్సవం రోజు ఆలయ అధికారులతో మాట్లాడి అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.

Updated Date - 2022-12-06T23:10:22+05:30 IST