పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-08-22T04:42:19+05:30 IST

ప్రతీ ఒక్కరు మొక్క లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా తెలిపారు.

పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలి
మొక్కను నాటి నీరు పోస్తున్న కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా

- కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా 

వనపర్తి రూరల్‌, ఆగస్టు 21: ప్రతీ ఒక్కరు మొక్క లు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా తెలిపారు. ఆదివారం పెద్దగూడెం అటవీ ప్రాంతంలో తిరుమలయ్య గుట్ట రహదారి పక్కన స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా జడ్పీ చైర్మన్‌తో కలిసి  కలెక్టర్‌ మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ వనపర్తి జిల్లా లో 8వ విడత హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తు న మొక్కలు నాటామని తెలిపారు. జిల్లాలో కోటి మొక్కలు నాటేందుకు లక్ష్యం నిర్ధారిం చుకున్నామని ఆమె అన్నారు. వజ్రోత్సవాలలో భాగంగా ఆదివారం జిల్లాలోని 14 మండలాల్లో, 255 గ్రామ పంచాయతీలలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు ఆమె వివరించారు. వనపర్తి జిల్లాలో అటవీ సంపద తక్కువగా ఉన్నందున అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వా మ్యంతో విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, డీఎఫ్‌వో రామకృష్ణ, డీఆర్‌డీవో నరసింహులు, మునిసిపల్‌ కమిషనర్‌ విక్రమ్‌ సింహారెడ్డి, జిల్లా అధికారులు, వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, పెద్దగూడెం సర్పంచ్‌ కొండన్న, ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.  


పెబ్బేరులో...


పెబ్బేరు : పెబ్బేరు పట్టణ కేంద్రంలో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆదివారం పట్ట ణంలోని 1,7,11వ వార్డులలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఎద్దుల కరుణశ్రీ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ కర్రెస్వామి, మునిసిపల్‌ కమిషనర్‌ జాన్‌ కృపాకర్‌, కౌన్సిలర్లు  ఎల్లారెడ్డి, ఎల్లాస్వామి, మునిసిపల్‌ ఆఫీసర్లు రాజ శేఖర్‌రెడ్డి, యోగేష్‌, మెప్మా సిబ్బంది శివ,పట్టణ నా యకులు సాయిరెడ్డి, దిలీప్‌రెడ్డి, పాల్గొన్నారు.


వీపనగండ్లలో..


వీపనగండ్ల : మొక్కలు నాటి పర్యావరణాన్ని పరి రక్షించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని ఎంపీ డీవో కథలప్ప తెలిపారు. వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం మండలంలో 3100 మొక్కలు నాటే కార్య క్రమాన్ని ప్రారంభించారు. వీపనగండ్లలోని ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు.  కార్యక్రమంలో ఏపీ వో శేఖర్‌గౌడ్‌, సర్పంచులు నరసింహరెడ్డి, రఘునాథ్‌ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఉపాధి సిబ్బంది, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.


చిన్నంబావిలో...


చిన్నంబావి : స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగం గా నిర్వహిస్తున్న వన మహోత్సవంలో మండలం లోని లక్ష్మిపల్లిలో ఎంపీపీ సోమేశ్వరమ్మ, జడ్పీటీసీ వెంకట రమణమ్మలు ఆదివారం మొక్కలు నాటారు.  కార్యక్రమంలో ఎంపీడీవో రవి నారాయణ, ఏపీవో, పంచాయతీ కార్యదర్శి , ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


పాన్‌గల్‌లో...


పాన్‌గల్‌ : మొక్కల సంరక్షణతోనే పర్యావరణ పరిరక్షణ కొనసాగుతుందని అందుకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని ఎంపీపీ మామిళ్లపల్లి శ్రీధర్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవంలో భాగంగా ఆదివా రం  ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకంతోనే మానవాళి మనుగడ కొన సాగుతుందని, అందుకు ప్రతీ ఒక్కరు మొక్కలు పెంచాలన్నారు. కార్యక్రమంలో సర్పంచు గోపాల్‌ రెడ్డి, తహసీల్దార్‌ యేసయ్య, ఎంపీడీవో నాగేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ నాగన్న, ఆర్‌ఐ మహేష్‌, ఏపీవో కురుమయ్య, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్థులు పాల్గొన్నారు.

Read more