ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

ABN , First Publish Date - 2022-01-04T05:21:01+05:30 IST

టీనేజర్లు (15-18) అందరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శశికళ అన్నారు.

ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలి
వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తున్న జిల్లా ప్రోగ్రాం అధికారి శశికళ

- జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శశికళ 

- టీనేజర్లకు వ్యాక్సినేషన్‌ ప్రారంభం

- మొదటిరోజు 698 మందికి టీకా

గద్వాల క్రైం/ అయిజ/ అలంపూర్‌, జనవరి 3 : టీనేజర్లు (15-18) అందరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శశికళ అన్నారు. గద్వాల పట్టణంలోని జిల్లా ప్రభు త్వ ఆసుపత్రిలో సోమవారం వ్యాక్సినేషన్‌ ప్రత్యేక డ్రైవ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హత గల ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకొని గద్వాలను  కరోనా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలో 35,901 మంది టీనేజర్లకు వ్యాక్సిన్‌ వేయాల్సి ఉందని తెలి పారు. మొదటి రోజు సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 వ్యాక్సినేషన్‌ కేంద్రాల్లో 698 మందికి టీకా వేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిశోర్‌కుమార్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ మధుసూదన్‌రెడ్డి, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సువేద, డీపీహెచ్‌ఎన్‌ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

- వ్యాక్సినేషన్‌ ప్రత్యేక డ్రైవ్‌ను జడ్పీ వైస్‌ చైర్‌పర్సన్‌ సరోజమ్మ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులందరూ టీకా వేయించు కోవాలని చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ రామేశ్వరమ్మ, ఉమ్మడి జిల్లా డైరక్టర్‌ సుభాన్‌, ఎంపీపీ ప్రతాప్‌గౌడు పాల్గొన్నారు. 


విద్యార్థులకు వ్యాక్సినేషన్‌

అయిజ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థు లకు అయిజ ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవా రం కొవిడ్‌ టీకా ఇచ్చారు. కళాశాల ప్రిన్స్‌పాల్‌ రాములు, ఉపాధ్యాయులు కృష్ణవర్ధన్‌ ఆధ్వర్యంలో ఇంట ర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చి టీకా వేయించారు. ప్రభుత్వ వైద్యాధికారి స్వరూపారాణి, ఎంపీడీవో సాయిప్రకాష్‌ పర్యవేక్షణలో టీకాలు వేశారు. 


నిబంధనలు పాటించాలి

ఒమైక్రాన్‌ వైరస్‌ బారిన పడకుండా విద్యార్థులందరూ నిబంధనలు పాటించాలని ప్రిన్సిపాల్‌ హృద యరాజు విద్యార్థులకు సూచించారు. అలంపూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో డాక్టర్‌ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులందరూ మాస్కులు ధరించాలన్నారు.  అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన వ్యాక్సినేషన్‌ శిబిరాన్ని అధికారులు పరిశీలించారు.  

Updated Date - 2022-01-04T05:21:01+05:30 IST