సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-12-15T23:15:21+05:30 IST

ఆశ వర్కర్లు చేస్తున్న పని కి సమాన వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దీప్లా నాయక్‌ డిమాండ్‌ చేశారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
నూతన కలెక్టరేట్‌ ముందు ధర్నా చేస్తున్న ఆశ వర్కర్లు

  • వెట్టి చాకిరీ విముక్తికి ప్రభుత్వంపై పోరాడుదాం

- సుప్రీం కోర్టు ఆదేశాలను ఆమలు చేయాలి

మహబూబ్‌ నగర్‌ (కలెక్టరేట్‌), డిసెంబరు 15 : ఆశ వర్కర్లు చేస్తున్న పని కి సమాన వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దీప్లా నాయక్‌ డిమాండ్‌ చేశారు. సంబంధం లేని పనులు చెపుతూ వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందేం దుకు ప్రభుత్వంపై పోరాడుదామని ఆయన పేర్కొన్నారు. సమాన పనికి స మాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ గురువారం కలెక్టర్‌ కార్యాలయం ముందు ధర్నా, 48 గంటలు వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఆశ వర్కర్లకు రూ.10 వేల వేతనం ఫిక్స్‌ చేశారని అన్నారు. కురుమూర్తి, జిల్లా కోశాధికారి చంద్రకాంత్‌ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో పేద ప్రజలకు వైద్యసేవలు అందిస్తున్న ఆశలకు పారితోషికం పేరుతో రూ. 3 వేలు, రూ. 5 వేలు, రూ. 6 వేలతోనే ప్రభుత్వం వారి శ్రమను దోచుకుంటున్నదని విమర్శించారు. వెట్టి చాకిరినుంచి విముక్తి పొందేందుకు ప్రభుత్వం పై పోరాడుతామని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కిల్పించాలని డిమాండ్‌ చేశారు. చేపట్టిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు తిరుమలయ్య, సత్తయ్య, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు, సాధన, సావిత్రి, అలివేలు, రాజ్యలక్ష్మిలతో పాటు పీఎస్‌ఎల్‌ నుంచి 300 మంది ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T23:15:26+05:30 IST