అంకితభావంతో విధులు నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-12-31T22:58:04+05:30 IST

పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలని డీఏస్పీ రంగస్వామి అన్నారు.

అంకితభావంతో విధులు నిర్వహించాలి

  • డీఏస్పీ రంగస్వామి

ఉండవల్లి, డిసెంబరు 31: పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలని డీఏస్పీ రంగస్వామి అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం డీఏస్పీ రంగస్వామి ఉండవల్లి పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్‌ రికార్డులు, పరిసరాలు, జనరల్‌ డైరీ, సెంట్రీ రిలీఫ్‌ బుక్‌, విలేజి రోస్టర్‌, ప్రాసెస్‌ రిజిస్ర్టార్‌, బీట్‌ డ్యూటీ బుక్‌, ఉన్నతాధికారుల విజిటింగ్‌ బుక్స్‌, ఫైనల్‌ రిపోర్స్‌, సిబ్బంది నిర్వహిస్తున్న విధులను తనిఖీ చేశారు. అనంతరం స్టేషన్‌ సిబ్బందికి వారి విధుల గురించి దిశానిర్ధేశం చేశారు. స్టేషన్‌లో ఎవరి విధులు వారు నిత్యం అమలు అయ్యేటట్లు చూసుకోవాలని అన్నారు. కేటాయించి న గ్రామాలకు సంబంధించిన పూర్తి సమాచారం కలిగి ఉండాలన్నారు. గ్రా మాలలో కమ్యూనిటీ ప్రొగ్రాంలు నిర్వహించి, బాల్యవివాహాలు, మూఢ నమ్మకాలు, 4జీ, ఆన్‌లైన్‌ మోసాలు అంశాలపై ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానాన్ని అమలు పరిచి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను తీర్చాలని అన్నారు. డయల్‌ 100కు వచ్చిన ఫిర్యాదులో సంఘటన స్థలానికి వెంటనే చేరుకోవాలని, బ్లూకోల్ట్స్‌, పెట్రోల్‌కారు, 24 గంటలు నిరంతరం గస్తీ నిర్వహించాలని, రౌడీ షీటర్స్‌, సస్పెక్ట్స్‌, పాత నేరస్థులపై నిఘా ఉంచాలని అన్నారు. ప్రజా ఫిర్యాదులో జాప్యం వహించడం తగదన్నారు. అనంతరం స్టేషన్‌ సిబ్బందికి, మహిళా పోలీసులకు ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో అలంపూర్‌ సీఐ సూర్యనాయక్‌, ఎస్సై బాలరాజు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T22:58:05+05:30 IST