బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యే డాక్టర్‌ బాలకిష్టయ్య

ABN , First Publish Date - 2022-11-15T23:11:00+05:30 IST

ఒక వైపు ఎమ్మెల్యేగా, మరోవైపు ప్రజా డాక్టర్‌గా సేవలం దించిన గొప్ప వ్యక్తి డాక్టర్‌ బాలకిష్టయ్య అని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాకాసి లోక్‌నాథ్‌రెడ్డి అన్నా రు.

 బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యే డాక్టర్‌ బాలకిష్టయ్య
డాక్టర్‌ బాలకిష్టయ్య విగ్రహానికి నివాళి అర్పిస్తున్న జడ్పీ, మునిసిపల్‌ చైర్మన్లు

- జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి

- డాక్టర్‌ బాలకిష్టయ్య విగ్రహానికి పలువురు ఘనంగా నివాళి

వనపర్తివైద్యవిభాగం, నవంబరు 15: ఒక వైపు ఎమ్మెల్యేగా, మరోవైపు ప్రజా డాక్టర్‌గా సేవలం దించిన గొప్ప వ్యక్తి డాక్టర్‌ బాలకిష్టయ్య అని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాకాసి లోక్‌నాథ్‌రెడ్డి అన్నా రు. బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణంలో డాక్టర్‌ బాల కిష్టయ్య జయంతిని వివిధ రాజకీయ, ప్రజా, కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఆస్పత్రి ఆవరణంలోని బాలకిష్టయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజక వర్గ ప్రజలకు డాక్టర్‌ బాలకిష్టయ్య చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఎమ్మెల్యేగా ఉంటునే డాక్టర్‌ వృత్తిని కొనసాగించేవారని, ఎవరి ఆపదలో ఉన్న నేరుగా వారి ఇంటికి వెళ్లి ఉచితంగా వైద్యం అందించేవారని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ గట్టు యాదవ్‌, నరసింహ, డాక్టర్‌ చైతన్యగౌడ్‌, ఫార్మాసిస్టు రాజేందర్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో...

డాక్టర్‌ బాలకిష్టయ్య జయంతిని మంగళవారం అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్ప త్రి ఆవరణంలో గల డాక్టర్‌ బాలకిష్టయ్య విగ్రహా నికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పిం చారు. కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక నాయ కుడు, మాజీ కౌన్సిలర్‌ సతీష్‌ యాదవ్‌, డాక్టర్‌ బాలకిష్టయ్య అభిమానులు, మిత్రులు, అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిల ర్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాల నాయకులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

టీజేఏసీ ఆధ్వర్యంలో...

వనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాలకిష్టయ్య 98వ జయంతిని, బిర్సాముండా 147వ జయంతిని టీజేఏసీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో డాక్టర్‌ బాలకిష్టయ్య, బిర్సాముండా చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. కార్యక్రమంలో టీజేఏసీ నాయకులు ప్రజా వాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్‌, గిరిరాజాచారి, నాయికంటి నరసింహశర్మ, విభూది ఈశ్వర్‌, డప్పు నాగరాజు, కోనింటి వెంకటేశ్వర్లు, కావలి బాల స్వామి నాయుడు, పరమేశ్వరాచారి, సత్యం చారి, మాధవచారి, గంగాధర చారి పాల్గొన్నారు.

Updated Date - 2022-11-15T23:11:03+05:30 IST