-
-
Home » Telangana » Mahbubnagar » Double bedroom houses should be given to the poor-MRGS-Telangana
-
పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలి
ABN , First Publish Date - 2022-09-20T04:35:42+05:30 IST
ఎన్నికల ముందు పేదలకు ఇచ్చిన హామీ ప్రకారం అర్హులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని, లేకపోతే పేదలతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి అక్కడే బస చేస్తామని కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల సమన్వయకర్త జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి హెచ్చ రించారు.

- లేకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోనే బస
- కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల సమన్వయకర్త జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 19: ఎన్నికల ముందు పేదలకు ఇచ్చిన హామీ ప్రకారం అర్హులందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని, లేకపోతే పేదలతో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి అక్కడే బస చేస్తామని కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల సమన్వయకర్త జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి హెచ్చ రించారు. ఇళ్లు లేక ఎంతోమంది పేదలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే వా రికి ఇళ్లను ఇవ్వాలని, స్థలం ఉన్నవారికి రూ.3 లక్షలు ఇవ్వాలని డీసీసీ అధ్య క్షులు ఒబేదుల్లా కొత్వాల్‌తో కలిసి సోమవారం ఆయన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ తేజస్‌నందలాల్ పవర్‌కు వినతిపత్రం అందించారు. అనంతరం కాం గ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జడ్చర్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఐదువేల మందికి ఇళ్లు కావల్సి ఉందని, స్థలాలున్న వారందరికి వెంటనే రూ.3 లక్షలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేస్తా మని అవసరమైతే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామన్నారు. ఆసరా పింఛన్లు కూడా అరకొరగా పంపిణీ చేస్తున్నారని, ఒక్కో గ్రామంలో 70-80 మంది అర్హులు ఉంటే వారిలో పదిమంది వరకు మాత్రమే పంపిణీ చేసి ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.