రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టించొద్దు

ABN , First Publish Date - 2022-10-12T04:50:12+05:30 IST

ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి బడుగు బలహీనవర్గాలతో పాటు పేద ప్రజలందరికీ ఉచితంగా అందిస్తున్న రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టించవద్దంటూ అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌ అన్నారు.

రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టించొద్దు

- ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి ఉచితంగా  పంపిణీ చేస్తోంది  

- అధిక పోషకాలతో కూడిన బియ్యాన్ని మరికొద్దిరోజుల్లోనే పంపిణీ చేస్తాం

- జాతీయ ఆహార భద్రత దినోత్సవ అవగాహన సదస్సులో అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌ 

తాడూరు, అక్టోబరు 11 : ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి బడుగు బలహీనవర్గాలతో పాటు పేద ప్రజలందరికీ ఉచితంగా అందిస్తున్న  రేషన్‌ బియ్యాన్ని పక్కదారి పట్టించవద్దంటూ   అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌ అన్నారు. మంగళ వారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యా లయంలో జాతీయ ఆహార భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన సదస్సును ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మోతిలాల్‌ మాట్లాడుతూ దేశంలో ఎవరూ ఆక లితో చావకూడదనే ప్రధాన సంకల్పంతోనే ప్ర భుత్వాలు రేషన్‌ బియ్యం పంపిణీ కార్యక్రమా న్ని చేపట్టాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్ర భుత్వం ప్రజలను దృష్టిలో ఉంచుకొని వివిధ రకాల వంట సరుకులతో రేష న్‌దుకాణాలలో సరఫరా చేసినప్పటికీ ప్రస్తుతం కేవలం బి య్యం మాత్రమే అందిస్తున్నట్లు తెలిపారు. రేష న్‌ బియ్యం పొందుతున్న ప్రతీ కుటుంబం తప్ప నిసరిగా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. రానున్న మరికొద్ది రోజుల్లో ప్రోటీఫైడ్‌ రైస్‌ను సరఫరా చేయనున్నామన్నారు. వంద కేజీల బియ్యానికి ఒక కేజీ ప్రోటీఫైడ్‌రైస్‌ను క లిపి ప్రజలకు రేషన్‌ దుకాణాల ద్వారా సరఫరా చేయనున్నట్లు తెలిపారు. అధిక పోషకాలతో కూడిన ఈ బియ్యాన్ని తినడం మూలంగా మ నుషుల్లో చాలా మార్పులు ఉండడమే కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటారని సూచించారు. ఈ నెల 16న జాతీయ ఆహార భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని రానున్న నాలుగురోజుల పా టు పెద్ద మొత్తంలో ప్రజలకు అవగాహన క ల్పించేందుకు అన్ని మండల కేంద్రాల్లో సమావే శాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామా ల్లో ఎవరైనా రేషన్‌ బియ్యాన్ని కొనేందుకు వ చ్చినట్లయితే స్థానికంగా ఉండే ఆర్‌ఐకి, తహసీ ల్దార్‌కు, పోలీసులకు సమాచారమిచ్చినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. సమావేశంలో డీఎస్‌వో మోహన్‌బా బు,  ఆర్డీవో నాగలక్ష్మి, తహసీల్దార్‌ కార్తీక్‌కుమా ర్‌, ఏఎస్‌వో ఎండి.జాకీర్‌, ఎంపీడీవో గంగామో హన్‌, సివిల్‌ సప్లయ్‌శాఖకు సంబంధించిన అధికారులు, రేష న్‌ డీలర్లు, మహిళా సంఘాల సభ్యులు, శిశు సంక్షేమ శాఖకు చెందిన అధికా రులు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు. 

Read more