రక్తదానం ప్రాణదానంతో సమానం
ABN , First Publish Date - 2022-08-18T04:26:03+05:30 IST
రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో దాతలు ఇచ్చే రక్తం ప్రాణాలను నిలబెడుతుందని కలెక్టర్ హరిచందన అన్నారు.

- రక్తదాన శిబిరం ప్రారంభంలో కలెక్టర్ హరిచందన
నారాయణపేట టౌన్, ఆగస్టు 17 : రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర పరిస్థితుల్లో దాతలు ఇచ్చే రక్తం ప్రాణాలను నిలబెడుతుందని కలెక్టర్ హరిచందన అన్నారు. వజ్రో త్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా ఆసుపత్రిలో కలెక్టర్ రిబ్బన్ కట్‌చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. రక్తదాన ఆవశ్యకతను గుర్తించిన సీఎం కేసీఆర్ వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ నియోజకవర్గాల పరిధిలో ఒకరోజు రక్తదా నానికి కేటాయించారన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నియోజకవర్గానికి 75మంది చొప్పున రక్తదాతలు రక్త దాన శిబిరంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం రక్తదానం చేసిన యువకులకు కలెక్టర్ సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పద్మజరాణి, డీఎంహెచ్‌వో రాంమోహన్ రావు, డాక్టర్ రంజిత్, డాక్టర్ మల్లికార్జున్, జిల్లా అధికారులు శివప్ర సాద్, రాంచందర్, పుర చైర్పర్సన్ గందె అనసూయ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
మక్తల్ : ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా బుధవారం మక్తల్ పట్టణంలోని ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో 75మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డి ప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీకాంత్, రిటైర్డ్ డీఎంహెచ్‌వో పార్వతీ మాట్లాడుతూ ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ప్రతీనియోజకవర్గంలో రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. రక్తదానం వల్ల మరొకరికి ప్రాణదానం చేసినవారు అవుతారన్నారు. ఈ సందర్భంగా స్వచ్చందంగా 75 మంది యువ కులు రక్తదానం చేసినట్లు తెలిపారు. అంతకుముందు ఎంపీపీ వనజ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ శైలజ, డాక్టర్ నవీన్‌కు మార్రెడ్డి, వైద్య సిబ్బంది భిక్షపతి, గోవిందరాజు, హెల్త్ సూపర్వైజర్ సీతారామ్, శిరీష, రాకేష్, శ్రీధర్ కుమార్, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
