అయిజ మునిసిపాలిటీకి నిధులు ఇవ్వండి

ABN , First Publish Date - 2022-10-08T04:55:39+05:30 IST

అయిజ మునిసిపాలిటీకి రూ. 30కోట్ల నిధులు మంజూరు చేయాలని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం మంత్రి కేటీఆర్‌ను కోరారు.

అయిజ మునిసిపాలిటీకి నిధులు ఇవ్వండి

- పుర మంత్రి కేటీఆర్‌ను కోరిన ఎమ్మెల్యే అబ్రహాం

అలంపూర్‌ చౌరస్తా, అక్టోబరు 7: అయిజ మునిసిపాలిటీకి రూ. 30కోట్ల నిధులు మంజూరు చేయాలని అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాదులోని ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌కు వినతి పత్రం అందజేశారు. అలంపూర్‌ మునిసిపా లిటీకి రూ. రెండు కోట్లు మంజూరు చేసినందుకు  మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అత్యధిక జనాభా కలిగిన అయిజ మునిసిపాలిటీకి రూ.30 కోట్ల నిధులివ్వాలని కోరారు. ఇందుకు మంత్రి సానుకూలంగా  స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ పల్లారాజేశ్వరరెడ్డిని కలిశారు. నియోజక వర్గ అభివృద్ధికి నిధులివ్వాలని కోరారు. 

Updated Date - 2022-10-08T04:55:39+05:30 IST