బాధిత కుటుంబాలకు ఎల్‌వోసీల అందజేత

ABN , First Publish Date - 2022-12-16T23:00:52+05:30 IST

మండలంలోని నిర్వేన్‌ గ్రామానికి చెం దిన ఆంజనేయులు కుటుంబానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఎల్‌ వోసీ అందించారు.

బాధిత కుటుంబాలకు ఎల్‌వోసీల అందజేత
ఆంజనేయులుకు ఎల్‌వోసీ అందిస్తున్న ఎమ్మెల్యే ఆల

కొత్తకోట, డిసెంబరు 16: మండలంలోని నిర్వేన్‌ గ్రామానికి చెం దిన ఆంజనేయులు కుటుంబానికి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఎల్‌ వోసీ అందించారు. ఆంజనేయులు కూతుళ్లు ధరణి(12), ఇందుజా (9)లు కంటి, చెవి సంబంధిత వ్యాధితో సతమతమవుతున్నారు. అసలే పేద కుటుంబమైన ఆంజనేయులు పిల్లలకొచ్చిన రోగంతో సత మతమవుతు ఎమ్మెల్యే ఆల వద్దకు వెళ్లి సమ స్యను వివరించాడు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే సీఎం కార్యాల య అధికారులతో చ ర్చించి పిల్లలకయ్యే వైద్య సహాయం కోసం రూ.8 లక్షలు మంజూ రు చేయించారు. శుక్ర వారం మంజూరైన ఎల్‌ వోసీని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి బాధిత కుటుంబానికి అందించారు. కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్‌ రాములు, రామకృష్ణ ఉన్నారు.

- పాన్‌గల్‌ : రోడ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసు పత్రిలో చికిత్స పొందుతున్న మండలంలోని శాఖాపూర్‌ తండాకు చెందిన నేనావత్‌ నర్సింహ్మకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ రూ.లక్షా 50వేల ఎల్‌వోసీని శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి బాధిత కుటుంబీకులకు అందించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు రమేష్‌నాయక్‌, నిరంజన్‌నాయక్‌ ఉన్నారు.

Updated Date - 2022-12-16T23:00:53+05:30 IST