వికటించిన విందు భోజనం

ABN , First Publish Date - 2022-02-07T05:02:34+05:30 IST

జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం జరిగిన వివాహ వేడుకలో విందు భోజనం వికటించి పలువురు వాంతులు, విరేచనాలతో అస్వస్థత కు గురయ్యారు.

వికటించిన విందు భోజనం

80 మందికి వాంతులు, విరేచనాలు


నారాయణపేట, ఫిబ్రవరి 6 : జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం జరిగిన వివాహ వేడుకలో విందు భోజనం వికటించి పలువురు వాంతులు, విరేచనాలతో అస్వస్థత కు గురయ్యారు. నారాయణపేటకు చెందిన అమ్మాయికి షోలాపూర్‌కు చెందిన వరుడితో వివాహం జరిగింది. వివాహం అనంతరం పెళ్లి భోజనంలో ఓ తిపి పదార్థం తిన్న పలువు రు క్రమక్రమంగా వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై జిల్లా ఆసుపత్రికి వైద్యం కోసం దాదాపు 80 మందికి పైగా బారులు తీరారు. అస్వస్థతకు గురైన వారిలో చిన్నారులు సైతం ఉండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రి సూప రింటెండెంట్‌ మల్లికార్జున్‌ వైద్య సిబ్బందిని ఫోన్‌ చేసి ఆసుపత్రికి పిలిపించి చికిత్స అందిం చేలా చర్యలు తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగూరావు నామాజీ, సత్యయాదవ్‌, నందు నామాజీ, శ్రీనివాస్‌, మాణిక్‌ నగరి, అంబాదాస్‌ నగరి, రాము అస్వస్థతకు గురైన వారిని పరామర్శించి వైద్యసేవలపై ఆరా తీశారు. వైద్యసేవలు పొందుతున్న వారు కాస్త కుదుట పడడంతో నిర్వాహకులు ఊపిరి పీల్చుకున్నారు.


Updated Date - 2022-02-07T05:02:34+05:30 IST