వజ్రోత్సవాలు అంబరాన్ని తాకాలి
ABN , First Publish Date - 2022-08-09T05:34:35+05:30 IST
జిల్లాలో ఈ నెల 8నుంచి 22వ రకు నిర్వహించనున్న స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సంబురాలు అంబరాన్ని తాకేలా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

- కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్నగర్ (కలెక్టరేట్ ), ఆగస్టు 8: జిల్లాలో ఈ నెల 8నుంచి 22వ రకు నిర్వహించనున్న స్వాతంత్ర భారత వజ్రోత్సవాల సంబురాలు అంబరాన్ని తాకేలా కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఎస్. వెంకట్రావు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం రెవెన్యూ సమావేశ మందిరం లో వజ్రోత్సవాల నిర్వహణ సన్నాహక సమావేశంలో ఎస్పీ ఆర్. వెకటేశ్వర్లుతో కలిసి దిశా నిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ ఉత్సవాలకు హాజరు కాని అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మీదట అలా జరగకూడదని హెచ్చరించారు. ప్రజలలో దేశ భక్తిని, జాతీయతా భావాన్ని, సమైక్యతను పెంపొందించే విధంగా వజ్రోత్సవాలను నిర్వహించాలని సూచించారు. అన్నిశాఖలు సమన్వ యంతో పనిచేసి వజ్రోత్సవాలని విజయవంతం చేయాలని కోరారు. ఆగస్టు 15న ప్రతీ ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని, అలాగే వేడుకులు అంగరంగ వైభవంగా నిర్వహించాలని, పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆయా శాఖల శకటాలు ఏర్పాటు చేయాలని, శఖటాలు పట్టణం మొత్తం తిరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థులచేత సాస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని, వజ్రోత్సవాలలో భాగంగా ఈ 15 రోజుల పాటు ప్రతీ ఒక్కరు నూలు వస్త్రాలు ధరించాలని కలెక్టర్ తెలిపారు. ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వజ్రోత్సవాలలో భాగంగా నిర్వహించనున్న ఫ్రీడం రన్, ర్యాలీలు, సామూహిక జాతీయ గీతాలాపన తదితర కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వ హించాలని, అధికారులు, సిబ్బంది తప్పక పాల్గొనాలని కోరారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, ఆర్డీవో అనిల్ కుమార్, ఏఎస్పీ రాములు, స్పెషల్ కలెక్టర్ పద్మశ్రీ, డీటీ రాజగోపాల్, అధికారులు పాల్గొన్నారు.