ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలి
ABN , First Publish Date - 2022-08-30T04:44:43+05:30 IST
ప్రపంచ హాకీ వీరుడిగా ఖ్యాతి గాంచిన ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో విద్యా ర్థులు క్రీడల్లో రాణించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత అన్నారు.
- జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత
- అత్యుత్తమ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ : ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల టౌన్, ఆగస్టు 29 : ప్రపంచ హాకీ వీరుడిగా ఖ్యాతి గాంచిన ధ్యాన్‌చంద్ స్ఫూర్తితో విద్యా ర్థులు క్రీడల్లో రాణించాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ సరిత అన్నారు. ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకరిగా నిలిచిన ధ్యాన్‌చంద్ నేటి తరం క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కొనియడారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం పట్టణంలోని ఇన్‌డోర్ స్టేడియంలో దివంగత క్రీడాకారుడు ధ్యాన్‌చంద్ విగ్ర హానికి జడ్పీ చైర్‌పర్సన్ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, మునిసిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్‌లు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడారంగానికి ధ్యాన్‌చంద్ చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ క్రీడాదినోత్సవంగా నిర్వహిం చడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా నిర్వహిం చిన ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీవైఎస్‌వో ఎంపీ రమేష్‌బాబు, ఎస్‌జీఎఫ్ కార్యదర్శి బీ.ఎస్.ఆనంద్, ఫిజికల్ డైరెక్టర్, స్టేడియం ఇన్‌చార్జ్ జితేందర్, రిటైర్ట్ ఫిజికల్ డైరెక్టర్ కె.ప్రభా కర్, వ్యాయామ ఉపాధ్యాయులు కృష్ణయ్య, రజనీ కాంత్, కరాటే శ్రీహరి, క్రికెట్ శ్రీను, టి.ఆనంద్, ఫుట్ బాల్ విజయ్, జిల్లా పీఈటీ అసోసియేషన్ సభ్యులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.
ధ్యాన్‌చంద్‌కు ఘన నివాళి
మానవపాడు : విశ్వ విఖ్యాత హకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి వేడుకలను సోమవారం మానవపాడు జడ్పీహెచ్‌ఎస్‌లో ఘనంగా జరుపుకు న్నారు. ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. క్రీడా రంగానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని యువత క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం చెన్నయ్య, పీఈటీ శ్రీనివాసులు, ఉపాధ్యాయులు రామ్మూర్తి పాల్గొన్నారు.
