సమస్యలు పరిష్కరించాలని ధర్నా

ABN , First Publish Date - 2022-05-24T04:38:18+05:30 IST

జిల్లా కేంద్రం, పట్టణం, పలు కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని సీపీఎం నాయకుడు కిల్లెగోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

సమస్యలు పరిష్కరించాలని ధర్నా
ఆందోళన చేపట్టిన సీపీఎం నాయకులు


పాలమూరు, మే 23: జిల్లా కేంద్రం, పట్టణం, పలు కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని సీపీఎం నాయకుడు కిల్లెగోపాల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పట్టణంలో సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 15రోజుల నుంచి పలు వార్డుల్లో నెలకొన్న సమస్యలను సీపీఎం ప్రతినిధి బృందం పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. 28వ వార్డు బండ్లగేరిలో ఓపెన్‌ డ్రైయినేజీతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారని, షాషాబ్‌గుట్టలో భగీరథ నీటి సమస్య, మోతీనగర్‌ గుట్టపైన వడ్డెరలకు నివాస స్థలాలు లేవని పేర్కొన్నారు. పలు వార్డుల్లో నెలకొన్న సమస్యలను మునిసిపల్‌ అధికారులకు వివరించినట్లు తెలిపారు. సమస్యలను త్వరగా పరిష్కరించి ప్రజల ఆరోగ్యం కాపాడాలని కోరారు. కార్యక్రమంలో బి.చంద్రకాంత్‌, పద్మ, అనురాధ, గాలయ్య, విష్ణు, జహంగీర్‌, భానుప్రసాద్‌, వెంకటమ్మ, మాణిక్యరావు, శ్రీనివాసులు, లక్ష్మీ, గౌసియాబేగం, నాగమణి, అంజమ్మలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-24T04:38:18+05:30 IST