కలెక్టరేట్ ఎదుట వీఆర్‌ఏల ధర్నా
ABN , First Publish Date - 2022-12-16T22:44:52+05:30 IST
వీఆర్‌ఏలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయా లని వీఆర్‌ఏల జేఏసీ జిల్లా చైర్మన్ విజయ్ డిమాండ్ చేశారు.
నాగర్‌కర్నూల్ టౌన్, డిసెంబరు 16: వీఆర్‌ఏలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయా లని వీఆర్‌ఏల జేఏసీ జిల్లా చైర్మన్ విజయ్ డిమాండ్ చేశారు. శుక్రవారం వీఆర్‌ఏల జేఏసీ ఆధ్వర్యంలో కలె క్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన పలు డిమాండ్లతో కూ డిన వినతిపత్రాన్ని పరిపాలనాధికారికి అందజేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తం గా నిరవధిక సమ్మెకు దిగిన వీఆర్‌ఏలను మంత్రి కేటీ ఆర్ చర్చలకు పిలిచి తమ సమస్యలు పరిష్కరించేం దుకు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం హామీ ఇచ్చి రెండు నెలలు అవుతున్నా నేటికీ అమలు కు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హా మీ నెరవేర్చకపోవడంతో చలో ప్రగతిభవన్‌కు పిలుపు నిచ్చిన వీఆర్‌ఏలకు మునుగోడు ఎన్నికల వరకు ఆగా లని ప్రభుత్వం మాయమాటలు చెప్పిందని విమర్శిం చారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వీఆర్‌ఏ లకు ఇచ్చిన హామీలను వెం టనే అమలు చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వీ ఆర్‌ఏల జేఏసీ ఆధ్వర్యంలో మరో నిరవధిక సమ్మెకు దిగు తామని ఆయన హెచ్చరించా రు. సీఐటీయూ జిల్లా ఉపా ధ్యక్షుడు పొదిల రామయ్య, నాయకులు అశోక్, వీఆర్‌ఏల జేఏసీ నాయకుఉల సాయి, ధర్మేందర్, సిద్దన్న, సలేశ్వరం, శేఖర్, సాయి, యాదయ్య, శో భారాణి, జ్యోతి, కళావతి, బాలస్వామి, నిరంజన్, బంగారయ్య, కాశీంపాల్గొన్నారు.
పెంట్లవెల్లి: సమ్మె సమయంలో వీఆర్‌ఏలకు ఇ చ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వీఆర్‌ఏ ల సంఘం మండల అధ్యక్షుడు స్వాములు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాల యంలో తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. వీఆర్‌ఏ కుర్మయ్య, ఆశన్న, లక్ష్మీ, కల్పన పాల్గొన్నారు.
పెద్దకొత్తపల్లి: మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వీఆర్‌ఏలు శుక్ర వారం విధులను బహిష్కరించారు. వీఆర్‌ఏల జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం మండలంలోని వీఆర్‌ఏలు తమ విధులను బహిష్కరించారు. వీఆర్‌ఏల జేఏసీ చైర్మన్ మల్లేష్‌నాయుడు, వీఆర్‌ఏల లలిత, తేజ, సోమేశ్వరి తదితరులు ఉన్నారు.