ధరణి పోర్టల్‌ లోప భూయిష్టం

ABN , First Publish Date - 2022-11-24T23:51:32+05:30 IST

తెలంగాణ ప్రభు త్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ లోప భూయిష్టంగా ఉందని, దీనివల్ల సామాన్య రైతులు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్‌పార్టీ నాయకులు అన్నారు.

ధరణి పోర్టల్‌ లోప భూయిష్టం
మహబూబ్‌నగర్‌ రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

- తహసీల్దార్‌ కార్యాలయాల ముందు కాంగ్రెస్‌ ధర్నా

- నిరసనల్లో ఆ పార్టీ నాయకులు

మహబూబ్‌నగర్‌ రూరల్‌/ జడ్చర్ల/ గండీడ్‌/ మహమ్మదాబాద్‌/ హన్వాడ/ భూత్పూర్‌/ దేవరకద్ర/ మూసాపేట/ మిడ్జిల్‌/ నవాబ్‌పేట/ అడ్డాకుల, నవంబరు 24 : తెలంగాణ ప్రభు త్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్‌ లోప భూయిష్టంగా ఉందని, దీనివల్ల సామాన్య రైతులు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్‌పార్టీ నాయకులు అన్నారు. రైతు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలు పు మేరకు గురువారం జిల్లా అంతటా ఆ పార్టీ శ్రేణులు తహసీల్దార్‌ కా ర్యాలయాల ముందు ఆందోళనలు చేపట్టారు. భూ సమస్యలు పరిష్కారం కాకుండా, రైతులకు గుదిబండగా మారిన ధరణి పోర్టల్‌ను రద్దు చేయా లని డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతు రుణమాఫీ చేయడం లేదని, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడం లేదని నాయకులు దుయ్యబట్టారు. పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎక్కడికక్కడ తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ నెల 30న తాలూకా కేంద్రాల్లో, డిసెంబరు 5న కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు.

ఫ మహబూబ్‌బ్‌ నగర్‌ రూరల్‌ మండల తహసీల్దార్‌ కార్యాలయం ముందు మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లు నర్సింహారెడ్డి నేతృత్వంలో జరిగిన ఆందోళనలో డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ పాల్గొని ప్రసంగించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.

ఫ జడ్చర్ల తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా కాంగ్రెస్‌ పార్టీ నా యకులు, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. అనంతరం నాయబ్‌ తహసీల్దార్‌ వెంకటేశ్వరికి వినతిపత్రం అందజేశారు.

ఫ గండీడ్‌ ఉమ్మడి మండలంలో మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆయా మండలాల తహసీల్దార్లు జ్యోతి, ఆంజనేయులుకు వినతిపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ గండీడ్‌, మహమ్మదా బాద్‌ మండలాల అధ్యక్షుడు నరసిం హారావు, నారాయణ పాల్గొన్నారు.

ఫ హన్వాడలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు వెంకటయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు సంజీవ్‌ ముదిరాజ్‌ పాల్గొన్నారు.

ఫ భూత్పూర్‌లో కాంగ్రెస్‌ పార్టీ మం డల అధ్యక్షుడు వెంకట నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ముందు జరిగిన ఆందోళనలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.

ఫ దేవరకద్ర తహసీల్దార్‌ కార్యాలయం ముందు పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్‌కుమార్‌గౌడ్‌, ఆర్గనైజింగ్‌ సెకట్రరి కొండ ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. తహసీల్దార్‌ జ్యోతికి వినతి పత్రం అందజేశారు.

ఫ మూసాపేటలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి శేఖర్‌ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో టీపీసీసీ కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, అధికార ప్రధినిధి హర్షవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

ఫ మిడ్జిల్‌లో కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు అల్వాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఎంపీటీసీ గౌస్‌, నాయకులు నరసింహ, సంపత్‌ కుమార్‌, పర్వతాలు, వెంకటేష్‌గౌడ్‌, ఆదాము, రామ్‌గౌడ్‌ పాల్గొన్నారు.

ఫ నవాబ్‌పేట తహసీల్దార్‌ కార్యాలయం ముందు డీసీసీ ప్రధాన కార్య దర్శి బంగ్ల రవి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పీ.రంగారావు, మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు జహీర్‌ అక్తర్‌తో కలిసి నిరసన చేపట్టారు. తహసీ ల్దార్‌ రాజేందర్‌రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు.

ఫ అడ్డాకులలో కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు నాగిరెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కొండా జగదీశ్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తహసీల్దార్‌ కిషన్‌కు వినతిపత్రం అందజేశారు.

Updated Date - 2022-11-24T23:51:36+05:30 IST