వందశాతం పన్నుల వసూలుతోనే అభివృద్ధి

ABN , First Publish Date - 2022-02-25T04:59:03+05:30 IST

వందశాతం పన్నులు వసూలుతోనే మునిసిపాలిటీల్లో అభివృద్ధి సాధ్యపడు తుందని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ పేర్కొన్నారు.

వందశాతం పన్నుల వసూలుతోనే అభివృద్ధి
కొల్లాపూర్‌ మునిసిపాలిటీ వార్షిక బడ్జెట్‌ సమావేశానికి హాజరైన కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ మనూచౌదరి, చిత్రంలో ముసిపిల్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి

- కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

- రూ.884.43లక్షలతో కొల్లాపూర్‌ మునిసిపాలిటీ వార్షిక బడ్జెట్‌ ఆమోదం


కొల్లాపూర్‌, ఫిబ్రవరి 24: వందశాతం పన్నులు వసూలుతోనే మునిసిపాలిటీల్లో అభివృద్ధి సాధ్యపడు తుందని  కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ పేర్కొన్నారు. కొల్లాపూర్‌ మునిసిపాలిటీ 2022-23వార్షిక బడ్జెట్‌ సమావేశం గురువారం పట్టణంలోని నూతన గ్రంథా లయ భవనంలో కొల్లాపూర్‌ మునిసిపాలిటీ అధికారు లు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ మనూచౌదరితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మునిసిపాలిటీ కౌన్సిల్‌ 2022-23ఆర్థిక సంవత్సరంలో రూ.884.43లక్షల అంచనా బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా కలెక్టర్‌  సమక్షంలో కౌన్సిల్‌ సభ్యులు ఆమోదించుకున్నారు. ఇందులో ముని సిపాలిటీ సొంత ఆదాయ వనరులు రూ.623.13లక్షలు, ప్రభుత్వ గ్రాంట్‌ నిధులు రూ.238.80లక్షలు ఉంది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మునిసిపాలిటీ వా ర్షిక అంచనా బడ్జెట్‌కు సంబంధించిన మునిసిపాలిటీ  ఆదాయ వ్యయాల ప్రణాళికలు పకడ్బందీగా అందించి పన్నులు వందశాతం వసూలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మునిసిపాలిటీ అభివృద్ధి కావడానికి పన్నులు ఎంతో దోహదపడు తాయని, మునిసిపాలిటీకి రావాల్సిన వివిధ పన్నులను జాప్యం లేకుండా సకాలంలో వసూలు చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. కౌన్సిల్‌ సభ్యులు చర్చించి వాటిని తీర్మానించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. నిధులలో పదిశాతం హరితహా రానికి కేటాయించాలని, హరితహారం వంద శాతం అమలయ్యేలా నిధులు సద్వినియోగం చేసుకునేలా చ ర్యలు తీసుకోవాలని, వీధి దీపాలు, పారిశుధ్యంపై ప్ర త్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సూచించారు. బడ్జెట్‌ సమావేశాల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులు బాలస్వామి, మునిసిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు కొల్లాపూర్‌ మునిసిపాలిటీ వార్డులల్లో సమస్యలు నెల కొన్నాయని, వీధి దీపాలు సరిగ్గా లేవని, అభివృద్ధి కుం టుపడిందని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు.  స్పందించిన కలెక్టర్‌ సభ్యులు లెవనెత్తిన అంశాలను పరిశీలించి వెం టనే చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ విక్రమ్‌సింహారె డ్డిని ఆదేశించారు. అనంతరం  కలెక్టర్‌ను మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సన్మానించారు. ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ జైత్రం నాయక్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ మహెముదాబేగం, మునిసిప ల్‌ కౌన్సిల్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 


శిశువు ఎదుగుదలలో ఉన్న సమస్యలు గుర్తించి పరిష్కరించాలి

నాగర్‌కర్నూల్‌: శిశువు ప్రారంభంలో ఉన్న సమస్యల ను గుర్తించి, ఆరోగ్యవంతమైన ఎదుగుదలకుశిశువు తల్లిదండ్రులతోపాటు ప్రతి ఆశ వర్కర్‌, ప్రతి అంగన్‌ వాడీ టీచర్లు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్‌ పి.ఉద య్‌కుమార్‌ అన్నారు. గురువారం నాగర్‌కర్నూల్‌ పట్ట ణంలోని ఫంక్షన్‌ హాల్‌లో ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌, యూనిసెఫ్‌ ఆధ్వర్యంలో  జిల్లాలో పదర, అమ్రాబాద్‌ మండలాల్లో నిర్వహించిన ఎర్లీ చైల్డ్‌ డెవల ప్‌మెంట్‌ పైలట్‌ ప్రాజెక్టును కలెక్టర్‌ ప్రారంభించారు. ప్రారంభ దశలో శిశువు ఎదుగుదలకు సమస్యలను గు ర్తించడం పరిష్కరించడం ఎలా అనే విషయంపై ఇం డియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రతినిధులతో అంగన్‌వాడీ సీడీపీవోలు, వైద్యారోగ్య శాఖ ఆశ సూపర్‌ వైజర్లకు నిర్వహించిన ఒక రోజు ఓరియంటేషన్‌ కార్య క్రమానికి హాజరైన కలెక్టర్‌  మాట్లాడారు.  ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రతినిధులు డాక్టర్‌ సమీక్షా సింగ్‌, డాక్టర్‌ రాజన్‌శుక్లా, డాక్టర్‌ జననీచారి, డాక్టర్‌ సీమాగఫుర్జివాలా, డాక్టర్‌ శ్రీనాథ్‌, సంక్షేమ అధికారిణి వెంకటలక్ష్మి, ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ సాయినాథ్‌రెడ్డి, డిప్యూటీ డీఎంహెచ్‌వో వెంకటదాస్‌, డీ ఎల్‌పీవో రామ్మోహన్‌రావు, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ శ్రీనివాస్‌, సీడీపీవోలు, ఆశ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-25T04:59:03+05:30 IST